పాకిస్తాన్ లో ఆహార సంక్షోభం గోధుమల కోసం కొట్టుకుంటున్న ప్రజలు... వీడియో వైరల్..!!

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.చాలా దేశాలు ఆర్థిక సంక్షోభం గుండా వెళ్తూ ఉండటంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

 Food Crisis In Pakistan People Are Fighting For Wheat Video Viral Details, Food-TeluguStop.com

దీంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొంది.ఈ  దిశగానే దాయాధి దేశం పాకిస్తాన్ లో దారిద్ర్యం తాండవిస్తోంది.

దీంతో ప్రభుత్వం సామాన్యుల ఆకలి తీర్చడానికి గోధుమపిండి పంచుతూ ఉంది.ఈ క్రమంలో రేషన్ దుకాణాలకు ప్రజలు పోటెత్తుతున్నారు.దాంతో తొక్కిసలాటలు సర్వసాధారణం అయిపోయాయి.పాకిస్తాన్ లో గోధుమకు తీవ్ర కొరత ఏర్పడింది.

దీంతో కిలో పిండి 150 రూపాయలు పైనే పలుకుతుంది.

గత ఏడాది వచ్చిన వరదలు కారణంగా.ఆహార సంక్షోభం నెలకొంది.ఇక ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

ఫిబ్రవరి నెలలోనే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే అవకాశం ఉందని అంటున్నారు.ఈ క్రమంలో భద్రతాబలగాలు నీడలో గోధుమపిండి పంపిణీ కార్యక్రమంలో… ప్రజలు గోధుమ పిండి కోసం కొట్టేసుకుంటున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube