పాకిస్తాన్ లో ఆహార సంక్షోభం గోధుమల కోసం కొట్టుకుంటున్న ప్రజలు... వీడియో వైరల్..!!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.చాలా దేశాలు ఆర్థిక సంక్షోభం గుండా వెళ్తూ ఉండటంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
దీంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొంది.ఈ దిశగానే దాయాధి దేశం పాకిస్తాన్ లో దారిద్ర్యం తాండవిస్తోంది.
దీంతో ప్రభుత్వం సామాన్యుల ఆకలి తీర్చడానికి గోధుమపిండి పంచుతూ ఉంది.ఈ క్రమంలో రేషన్ దుకాణాలకు ప్రజలు పోటెత్తుతున్నారు.
దాంతో తొక్కిసలాటలు సర్వసాధారణం అయిపోయాయి.పాకిస్తాన్ లో గోధుమకు తీవ్ర కొరత ఏర్పడింది.
దీంతో కిలో పిండి 150 రూపాయలు పైనే పలుకుతుంది. """/"/
గత ఏడాది వచ్చిన వరదలు కారణంగా.
ఆహార సంక్షోభం నెలకొంది.ఇక ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.
ఫిబ్రవరి నెలలోనే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో భద్రతాబలగాలు నీడలో గోధుమపిండి పంపిణీ కార్యక్రమంలో.ప్రజలు గోధుమ పిండి కోసం కొట్టేసుకుంటున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గోవాలో ఆ వ్యక్తి కోసం మందు కొన్న బన్నీ… అసలు విషయం రివీల్..ఎవరా స్పెషల్ పర్సన్?