సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష పడిందని తెలుస్తోంది.జయప్రద సహా ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించిందని సమాచారం.
జయప్రద థియేటర్ కాంప్లెక్స్ నిర్వహణకు సంబంధించిన కేసులో భాగంగా లేబర్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పును ప్రకటించింది.కాగా థియేటర్ లో పని చేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని చెల్లించలేదని ఆమెపై అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కార్మికులు దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది.