చిత్రం : ఫిదాబ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్దర్శకత్వం : శేఖర్ కమ్ములనిర్మాత : దిల్ రాజుసంగీతం : శక్తి కాంత్విడుదల తేది : జులై 14, 2017నటీనటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి
కథలోకి వెళితే :
వరుణ్ (వరుణ్ తేజ్) అమెరికాలో డాక్టర్.పెద్ద న్యూరాలాజిస్ట్ కావడం ఇతని కల.
తన అన్నకి సంబంధం చూడటంతో అమెరికా నుంచి బాన్సువాడ వస్తాడు.ఆ పెళ్ళికూతురి చెల్లే భానుమతి (సాయి పల్లవి).
పక్కా పల్లెటూరి పిల్ల.చలాకీగా ఉంటుంది.
నాన్నంటే ప్రాణం.ఎప్పటికీ తన ఊరిని, నాన్నని వదిలిపోకూడదు అనుకుంటుంది.
వరుణ్ తో ప్రేమలో పడినా, ఒక కారణాంతో తన భావోద్వేగాలను దాచుకోని రిజెక్ట్ చేస్తుంది.ఆ తరువాత వీరి ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగిందో తెరమీదే చూడండి.
నటీనటులు నటన :
లుక్స్ పరంగా కొత్తగా కనిపించిన వరుణ్, ఆ కొత్తదనాన్ని తన నటనలోకి తీసుకొచ్చాడు.భానుమతి రిజెక్ట్ చేసిన తరువాత మొదలు, వరుణ్ పెర్ఫార్మన్స్ తో, తన ఎమోషన్స్ తో బాగా కనెక్ట్ అయిపోతాం.
కంచె తరువాత తన కెరీర్ బెస్ట్ అనుకోవచ్చు
సాయి పల్లవి ఎలాంటి నటో మళయాళ ప్రేమమ్ చూసిన వారికి బాగా తెలుసు.పెద్దగా మేకప్ వాడదు, మొటిమల్ని కప్పిపుచ్చుకోదు, అక్కడే తాను ఒక నటి కాని హీరోయిన్ కాదు అని అర్థమయిపోతుంది.
చేసేది తొలి తెలుగు సినిమా.ఎవరిదో గొంతు అప్పుగా తెచ్చుకోలేదు.
తెలుగు, అందులోనూ తెలంగాణ యాస.ఇంతకంటే ఛాలెంజింగ్ ఏముంటుంది? ఛాలెంజ్ పై నిలబడింది సాయి పల్లవి.మన ఇంటి దగ్గరే ఉండే భానుమతి తను.తన పొగరు, వెటకారం, తండ్రిపై ప్రేమ, ఊరిపై ప్రేమ .అన్ని మనం నిజజీవితంలో చూసాం.కాదు కాదు, మనం అలా ఫీల్ అయ్యేంత నెచురల్ గా పెర్ఫార్మ్ చేసింది సాయి పల్లవి.
ఇంటర్వల్ కి ముందు అక్కతో సాయి పల్లవి ఏడ్చే సన్నివేశం మీరు మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిస్తారో ప్రయత్నించండి
మిగితా నటీనటులు పేర్లు తెలియవు జనాలకి.కాని వాళ్ళు కొత్త ముఖాల్లాగా అనిపించరు.
మన చూట్టూ ఉండే మనుషుల్లానే అనిపిస్తారు.భానుమతి అక్క, తండ్రి పాత్ర చేసిన ఇద్దరు మంచి పెర్ఫార్మన్స్ ని అందించారు.
టెక్నికల్ టీమ్ :
శక్తి కాంత్ అందించిన ఇప్పటికీ శ్రోతలను అలరించింది.వచ్చిండే, ఊసుపోదు పాటలు ఎక్కడపడితే అక్కడ వినిపిస్తున్నాయి.
ఈ పాటలు తెరపై ఇంకా అందంగా ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసాయి.
కెమెరా వర్క్ సూపర్.దిల్ రాజు ప్రొడక్షన్ అన్నాక నిర్మాణ విలువలు, విజువల్స్ బాగా ఉంటాయి.ఎడిటింగ్ లో ఒకటి రెండు చోట్ల చిన్న జెర్కులు ఉన్నాయి.
విశ్లేషణ :
మనస్పర్ధల వలన ఇద్దరు ప్రేమికులు ఒకరికి ఒకరు దూరంగా వెళుతూ ఉండటం అనేది కొత్త పాయింట్ కాదు.కాని ఫిదా పాయింట్ ని డీల్ చేసింది ఎవరో కాదు, శేఖర్ కమ్ముల.ఆ హస్తవాసి ఎక్కడకి పోతుంది.ఈ సినిమాలో పాత్రలు నటించవు, ప్రవర్తిస్తాయి.అందుకే తెలిసిన కథ అయినా, మన ముందు కొత్తగా జజరుగుతున్నట్లు ఉంటుంది.
కమ్ముల సినిమాలు అంటే కేవలం యూత్ కే నచ్చుతాయి అంటారు.కాని ఫిదా ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.
ఓ కూతురు భానుమతితో కనెక్ట్ అవుతుంది, ఓ తండ్రి ఆమె తండ్రికి కనెక్ట్ అవుతాడు, ఓ కుర్రాడు వరుణ్ కి కనెక్ట్ అవుతాడు.ఆకాశాన్ని దాటే సినిమా ఎమోషన్స్ లేవు ఇందులో, మనం నిజంగా చూసే భావోద్వేగాలు ఉన్నాయి.
అలాగని కేవలం ఎమోషన్స్ మీదే నడపలేదు.ఎక్కడా బోర్ కొట్టని కామెడి ఉంది.
కాసేపు నవ్వండి, కొన్ని ఎమోషన్స్ ని ఫీల్ అవుతూ ఎడవండి.ఫిదాకి ఫిదా అయిపోండి.
ప్లస్ పాయింట్లు :
* వరుణ్ – సాయి పల్లవి
* సహజమైన ఎమోషన్స్
* కథలో భాగమైన కామెడి
* తండ్రి కూతుళ్ళ సన్నివేశాలు
* సంగీతం
మైనస్ పాయింట్స్ :
* మాస్ సెక్షన్ ఆడియెన్స్ ని ఆకట్టుకోకపోవచ్చు (బిజినెస్ పరంగా)
చివరగా :
ఫిదాపై ఫిదా