ఘనంగా ఫాతిమా షేక్ జయంతి

నల్లగొండ జిల్లా: సమాజంలో సగ భాగమైన మహిళల అభ్యున్నతి కోసం,మహిళలందరూ చదువుకోవాలని పోరాటం చేసి,సమాజంలోని అసమానతులను అంతం చేయడానికి విశేషంగా కృషి చేసిన ఫాతిమా షేక్ భావాలు నేటి తరానికి ఆదర్శమని ప్రజా సంఘాల నాయకుడు కంబాలపల్లి వెంకటయ్య అన్నారు.

గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ జయంతిని ఘనంగా నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ సమాజ మార్పు కోసం నిరంతరం పరితపించారని,మహిళా ఉద్దరణకు ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప సమాజ సేవకురాలని కొనియాడారు.

వైరల్: పీలింగ్స్ పాటకి సెప్పులేసిన ముసలి బామ్మ... రష్మికను మ్యాచ్ చేసిందని కామెంట్స్!

Latest Nalgonda News