సూర్యాపేట జిల్లా:ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోదాడ టౌన్ సిఐ రాము,రూరల్ సిఐ రజిత రెడ్డి,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీస్ స్టేషన్ నుండి ద్విచక్ర వాహనంపై పోలీసులు హెల్మెట్ ధరించి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి నుండి బయలుదేరే ప్రతి ఒక్క వాహనదారుడు అనుకొని ప్రమాదం ఎదురైనప్పుడు తన తలపై గాయాలు కాకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐలు రంజిత్ రెడ్డి, సైదులు,ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్,రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి,అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్, చిలుకూరు ఎస్సై రాంబాబు,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.