ఈ గ్రామానికి ఎన్నికల కోడ్ వర్తించదా...?

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో ఎన్నికల కోడ్ ను స్థానిక అధికారులు తుంగలో తొక్కారు.

గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిమ్మెకు,చేతి గుర్తుకు, టిడిపి దిమ్మెకు,బీఆర్ఎస్ పార్టీ దిమ్మెకు పట్టాలు కప్పకుండా వదిలేశారు.

జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని పదే పదే చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతూ అధికారుల మాటలు ఉత్త మాటలేనని ఈ దిమ్మెలను చూస్తే అర్థమవుతుందని గ్రామస్తులు అంటున్నారు.అధికారులు చెప్పడం వరికే కానీ,ఆచరణలో అమలు అయితుందా లేదా అనే పర్యవేక్షణ కరువైదని తెలుస్తుంది.

Election Code Not Applicable To This Village , Election Code , Village, Violatio

ఎన్నికల అధికారులు కార్యదర్శులకు సదస్సులు అవగాహన కల్పించారు.అయినా ఎన్నికల అధికారుల మాటలను పెడచెవినపెట్టి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వివిధ రాజకీయ పార్టీల దిమ్మెలను ఓపెన్ గా వదిలేశారు.

ఎన్నికల కోడ్ ఈ గ్రామానికి వర్తించదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు దిమ్మెలను పట్టాలు కప్పిస్తారేమో చూడాలి మరి.!.

Advertisement

Latest Suryapet News