అలనాడు టెలిస్కోపులను ఎందుకు తయారు చేసారో తెలుసా?

టెలిస్కోపుల గురించి వినే వుంటారు.జీవులలో కెల్లా మనిషి జ్ఞానం కలవాడు.

 Do You Know Why Telescopes Are Invented Details, Telescope, Prepare,viral Latest-TeluguStop.com

అందుకనే అతని మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.అందులోనుండి అద్భుత ఆవిష్కరణలు వెలువడతాయి.అలా వెలువడిన ఓ అద్భుతమైన ఆవిష్కరణే టెలిస్కోప్.అవును… 2000 సంవత్సరాలకు పూర్వం చైనాలో ఓ ఫిలాసఫర్ మొదటిసారి కాంతిపై ప్రయోగాలు చేశాడు.ఆయన పేరే మోట్జో.కాంతిని ఓ క్లోజ్డ్ రూంలో బంధించటం ద్వారా కదలే బొమ్మలు తయారు చేయొచ్చని మొదటగా ఊహించింది ఆయనే.ఓ టెంట్ లాంటిది తయారు చేసి దానిన్ని అన్ని వైపులా మూసేసి ఒకే ఒక్క చిన్న రంధ్రం పెట్టి దాని బయట పడి నిలబడి మనుషులతో విన్యాసాలు చేయించేవాడు.

అక్కడే టెలిస్కోప్ కి పునాది పడిందని చెబుతారు.

అయితే మోట్జో కని పెట్టిన దానికి పేరు ఏంటో తెలియదు కాని విజ్ఞాన ప్రపంచం దాన్ని కెమెరా అబ్ స్క్యూరాగా పిలిచింది.ఇప్పుడున్న అన్ని కెమెరాలకు అదే ప్రోటో టైప్ అన్నమాట.

యుద్ధ వ్యూహాల్లో నిష్ణాతుడైన మోట్జో శాంతి కోసం పని చేసేవాడు.మరో వైపు తన శిష్యులతో కాంతిపై తను చేసిన పరిశోధనలను గ్రంథం రూపంలో తీసుకురావటం మొదలుపెట్టాడు.

కాని అథారిటీస్ రూల్స్ కి వ్యతిరేకంగా అప్పటివరకూ లేని విషయాలపై ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నాడని మోట్జోపై అప్పట్లో ఆరోపణలు మోపారు.

Telugu Galaxy, Earth, Jameswebb, Prepare, Space Research, Telescope, Telescopes,

తరువాతి కాలంలో న్యూటన్ మాట్లాడుతూ… భూమి వాతావరణం దాటి భవిష్యత్తులో టెలిస్కోపులను ప్రవేశపెట్టగలిగే రోజంటూ వస్తే, ఆ రోజు ఈ అనంతమైన విశ్వాన్ని మరింత లోతుగా పరిశోధించవచ్చని చెప్పాడు.వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఈ ఆలోచన సర్ ఐజక్ న్యూటన్ దే. సో ఇది మొత్తంగా టెలిస్కోపులతో మనిషి అంతరిక్షంలోకి చూడటానికి కారణమైన కొన్ని సంఘటనలు.ఇవన్నీ కలగలిసి ఈరోజు జేమ్స్ వెబ్ లాంటి అతిపెద్ద మానవనిర్మిత టెలిస్కోపు ఏర్పాటు చేసి పరిశోధనలు సాగించేవరకూ మనిషి ప్రయాణం సాగింది అంటే అతిశయోక్తిగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube