అమెరికా మాజీ అధ్యక్షుడి “గడ్డం” వెనుక సీక్రెట్ తెలుసా...!!!

కొంత మంది గడ్డం పెంచుకుంటే చూడటానికి బాగుంటుంది, ఇంకొందరికి గడ్డం ఉంటే అస్సలు చూడలేము.కానీ అత్యధిక శాతం మగవారు గడ్డం ఉంటేనే అందంగా కనిపిస్తారు.

 Do You Know The Secret Behind The beard Of The Former President Of The United St-TeluguStop.com

ఆడవారికి కూడా గడ్డం ఉన్న అబ్బాయిలు అంటేనే ఎక్కువ ఇష్టమట.ఏంటి ఈ గడ్డం గోల అనుకుంటున్నారా అసలు విషయం ఏంటంటే.

అమెరికా మాజీ అధ్యక్షుడు, అమెరికా చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అబ్రహం లింకన్.ఆయనకు గడ్డం పెంచుకోవడం అంటేనే ఇష్టం ఉండేది కాదట.

అయినా సరే అబ్రహం లింకన్ గడ్డం పెంచుకోవడం ఆ స్టైల్ చూసి అప్పటి కుర్ర కారు మొత్తం లింకన్ స్టైల్ ను ఫాలో అవ్వడం జరిగింది.నేటికి లింకన్ ను గుర్తు చేసుకుంటే ఆయన స్టైలిష్ గెడ్డం మాత్రమే గుర్తుకు వస్తుంది.సరే ఇష్టం లేకపోయినా లింకన్ గడ్డం ఎందుకు పెంచుకున్నారు.

1860 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి రిపబ్లికన్ పార్టీ తరుపున అబ్రహం లింకన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు.అప్పట్లో లింకన్ కు అమెరికన్స్ లో విశేష ఆదరణ ఉండేది అయితే మిగిలిన అభ్యర్ధుల కంటే ఆకర్షణీయంగా కనిపించే వారు కాదు.ఈ క్రమంలో ఓ కుటుంభానికి చెందిన 11 ఏళ్ళ బాలిక గ్రేస్ బెడెల్ అబ్రహం లింకన్ ను ఎంతో అభిమానించేది కానీ తాను లింకన్ ను చూడలేదట.

దాంతో ఆమె తండ్రి లింకన్ ఫోటో తీసుకువచ్చి చూపించగా ఆమె కొంత నిరాశకు గురయ్యిందట.బక్క పలుచగా ఉన్న ఆయన ఏ మాత్రం ఆకర్షణీయంగా లేరని ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారని ఆందోళన చెందిందట.

ఈ నేపధ్యంలో లింకన్ కు గడ్డం ఉంటే బాగుంటుందని భావించి నేరుగా లింకన్ కు లెటర్ రాసిందట.మీరు చాలా బక్కగా ఉన్నారు.ఇలా ఉంటే మిగిలిన అభ్యర్ధుల మీద పై చేయి ఎలా సాధిస్తారు.మీకు ఆడవారిలో అత్యధిక ఓట్లు రావాలన్నా, యువతలో ఓట్లు పడాలన్నా మీరు గడ్డం పెంచి తీరాల్సిందేనని పట్టుబట్టిందట.

మీకు నా లెటర్ చూసిన వెంటనే సమాధానం చెప్తూ ప్రతి ఉత్తరం రాయండి మీ స్పందనకి నేను వేచి చూస్తాను.మీకు కుదరకపోతే నా లాంటి కూతురు ఉంటే  ఆమెతో ఉత్తరం రాయించి పంపండి అని చెప్పిందట.

ఈ లేఖను అందుకున్న లింకన్ నవ్వుకుని అభినానికి గడ్డానికి సంభంధం లేదు అయినా నువ్వు చెప్పావు కాబట్టి నేను పెంచుకుంటాను అయితే నాకు నీలాంటి కూతురు లేదు, ముగ్గురు మగ పిల్లలే అని రెప్లై ఇచ్చారట అంతేకాదు ప్రమాణ స్వీకారానికి ఆమెకు ప్రత్యేక ఆహ్వానం ఇవ్వడమే కాకుండా ఆమెతో కాసేపు మాట్లాడారట లింకన్.

Do You Know The Secret Behind The "beard" Of The Former President Of The United States

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube