బాబు ' ముందస్తు ' వ్యూహం ! ఆ విధంగా ఎన్నికలను ఎదుర్కునేలా ?

టీడీపీ అధినేత చంద్రబాబు ‘ ముందస్తు ‘ వ్యూహం అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.‘ ముందస్తు అంటే ముందస్తు ఎన్నికలు కాదు.ముందస్తుగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే విషయంపై సుదీర్ఘ కసరత్తు మొదలు పెట్టారు.ఏపీలో బలంగా ఉన్న వైసీపీ ని ఎదుర్కోవడం అంటే ఆషామాషి  కాదు అని, 2024 ఎన్నికల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది అని బాబు భావిస్తున్నారు.

 Chandrababu Decided To Announce The Party Candidates A Year In Advance , Chandra-TeluguStop.com

అందుకే తెలుగుదేశం పార్టీలో జోష్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.దీంతో ఎన్నికలకు ఏడాది ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని బాబు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు పార్టీలో అంతర్గతంగా దీనిపై చర్చ నిర్వహిస్తున్నారు.

అంతే కాదు పార్టీ అభ్యర్థులుగా ఎవరిని నిలబడితే తప్పకుండా గెలుస్తారు అనే విషయం పైన దృష్టిపెట్టారు.ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో బలమైన టిడిపి అభ్యర్దులు ఎవరు అనే విషయం పైన సమగ్రంగా ఆరా తీస్తున్నారట.

దీంతో పాటు నియోజకవర్గాల వారీగా ఓ ప్రైవేటు సంస్థ తో రహస్యంగా సర్వే చేస్తున్నట్లు టీడీపీలోని కీలక నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్న,  ఆ విధంగా చేయడం వల్ల టికెట్ విషయంలో పేచీలు రావడంతో పాటు,  ప్రజల్లోకి వెళ్లేందుకు సరైన సమయం ఉండకపోవడం, ఎన్నికల సమయం వరకు ప్రజా పోరాటాలను చేపట్టేందుకు, నియోజకవర్గాల్లో పార్టీ కి సమర్థ వంతంగా నాయకత్వం వహిస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళేవారు లేకపోవడం,  ఇలా ఎన్నో అంశాలను లెక్కలోకి తీసుకుని ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాలని బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటించినా, వారు జనాల్లోకి వెళ్లేలా చేయడంతో పాటు,  పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టే విధంగానూ, వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే విధంగానూ, ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలోని లోపాలను హైలెట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే బాబు ముందస్తు అభ్యర్థుల ప్రకటన నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.మొత్తంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించక పోయినా,  కనీసం ఒక వంద స్థానాలు వరకైనా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాలనే కీలక నిర్ణయానికి బాబు వచ్చినట్లు సమాచారం.

Chandrababu Decided To Announce The Party Candidates A Year In Advance

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube