అలియా భట్ వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

 Bollywood Actress Alia Bhatt Dress Cost,alia Bhatt, Alia Bhatt Designer Dress, A-TeluguStop.com

ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తోంది.అదేవిధంగా సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

ఆమెకు బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే ఇప్పటివరకూ తన అందం అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన అలియా భట్ మొదటిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుంది.అయితే ఈమె ఫ్యాషన్లో కూడా ట్రెండింగ్ నీ ఫాలో అవుతూ రకరకాల ఫ్యాషన్ లతో ప్రేక్షకులకు మరింత చేరువ అవుతోంది.ఆలియా భట్ ఎక్కువగా మాధుర్య క్రియేషన్స్ వారు డిజైన్ చేసిన ఆభరణాలను, చీరలను, ఆమె ఎక్కువగా ధరిస్తూ ఉంటుంది.2007లో ప్రారంభించిన ఈ సంస్థ మొదట కేవలం ఆభరణాలను మాత్రమే డిజైన్ చేసేవారు.ఆభరణాల తో పాటుగా, డ్రస్సులు, అదేవిధంగా గృహ అలంకరణ సామాగ్రి ఇలా రకరకాలుగా డిజైన్ చేస్తున్నారు.

వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు.ఈ సంస్థను బెంగుళూరుకు చెందిన భానుమతి నరసింహన్ అనే వ్యక్తి స్థాపించారు.అలియా భట్ ధరించిన దుస్తుల ధరల విషయానికి వస్తే ఆమె ధరించిన కుర్తా ఖరీదు దాదాపుగా 47,500రూపాయలు.అలాగే పలాజొ 64,500 రూపాయలు.దుపట్టా 17,500మాధురి క్రియేషన్స్​ బ్రాండ్​ జ్యూయెలరీ 9,400.అయితే ఎక్కువగా చాలామంది ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రింజ్‌ ట్రెండ్‌ అంటే ఇష్టపడతారు కానీ, నాకు మాత్రం ఆ స్టయిల్‌ డిజైన్స్‌ పెద్దగా నచ్చవు.

అది తప్ప మిగితా ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ అన్నింటినీ నేను ఫాలో అవుతా.అని అలియా భట్ తెలిపింది.

RRR Movie Heroine Alia Bhatt Dress Price Alia Bhatt

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube