జాతీయ రహదారిపై వికలాంగుల నిరసన*

సూర్యాపేట జిల్లా:ఆగస్టు నెల గడిచినా నేటి వరకు ఆ నెల పెన్షన్ పంపిణీ చేయకపోవడం దురదృష్టకరమని,ఆసరా పింఛన్లు సకాలంలో పంపిణీ చేయకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆసరా పింఛన్లు సకాలంలో పంపిణీ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చివ్వెంల మండలం గుంపుల గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై వికలాంగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో పింఛన్ల కోసం నిరసన తెలుపుతున్న వికలాంగులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటం దురదృష్టకరమని,అక్రమ అరెస్టులతో వికలాంగుల ఉద్యమాలను ఆపలేరని అన్నారు.ఆసరా పింఛనే జీవనాధారంగా జీవనం వెల్లదీస్తున్న వృద్ధులు,వితంతువులు,వికలాంగులు,గీతకార్మికులు, బీడీ కార్మికులు,పైలేరియా బాధితులు సుమారు 38.75 లక్షల మంది ఆసరా పింఛన్ దారులకు సకాలంలో ఆసరా పింఛన్లు రాక వారి పరిస్థితి దయనీయంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు.వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ వివిధ రకాల మందులు వాడుతూ కాలం వెల్లదీస్తున్న వృద్ధులకు నేటికీ ఆసరా పెన్షన్ అందకపోవడంతో కనీసం తమకు అవసరమైన మందులు కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు.

సమాజం చేత,కుటుంబం చేత వివక్షకు గురవుతూ తమకు వచ్చే ఆసరా పింఛన్ తోనే బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న వికలాంగులకు సకాలంలో పింఛను రాక తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని,పెన్షన్ నకాలంలో వారు పడే కష్టాలు వర్ణనాతీతంగా మారాయని, బంగారు తెలంగాణలో అసరా పింఛన్లు సకాలంలో రాక ఆసరా పింఛన్ దారులు పడే కష్టాలు వారి ఓట్లతోనే గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులకు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు ఆనరా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

బంగారు తెలంగాణలో వికలాంగుల జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వం దళిత బంధు మాదిరిగానే వికలాంగుల బంధు పథకం తీసుకురావాలని డిమాండ్ చేశారు.తక్షణమే ప్రభుత్వం ఆసరా పించన్లు మంజూరు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని,ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోల్లూరి ఈదయ్య బాబు,జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధు యాదవ్,మండల అధ్యక్షులు కొల్లూరి నాగరాజు, మహిళా నాయకులు తురక నాగమ్మ,మట్టపెల్లి పూలమ్మ,సరిత,సంఘం మండల అధ్యక్షులు సైదులు,పిట్ట వెంకట్ రెడ్డి,గోగు వెంకన్న,శివరాత్రి బక్కయ్య,బోలక ఉప్పమ్మ,షేక్ హస్సేనా,పబ్బు వెంకటమ్మ,ఉరుముల ఆదయ్య,పబ్బు లచ్చుమయ్య, అచ్చమ్మ,పిట్ట అమృతా రెడ్డి,ఉరుముల పద్మ, మూగ చంద్రమ్మ,మామిడి పద్మ,పసనాది రాములు, నాతాల సుగుణమ్మ,వెగలం శ్వేత,వెగలం సక్కుబాయమ్మ,దోనియాల సూరమ్మ తదితరులు పాల్గొన్నారు.

పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలంటే?
Advertisement

Latest Suryapet News