దర్శకుడికి ఒక విజన్ ఉంటుంది.కొన్నిసార్లు సినిమా లిబర్టీ తీసుకొని ఎవరికి నచ్చినట్టుగా వారు కథలను అల్లుకుంటారు.
కానీ ఒక సినిమా తీస్తే దానికి అప్పుడు ఉన్న ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించి దానికి కాస్త కాల్పనిక పరిస్థితులను జోడించి విజువల్ వండర్స్ గా తీస్తే ఎటువంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా కూడా హిట్ అవుతుంది అని నిరూపించిన అతి తక్కువ దర్శకుల లో మణిరత్నం( Director Maniratnam ) ఒకరు.ఆయన ప్రతి సినిమా కూడా కళ్ళకు కట్టినట్టుగా ఎంతో అద్భుతంగా ఉంటాయి.
సినిమా ఫ్లాప్ అయినా కూడా మణిరత్నం కి మాత్రం కచ్చితంగా ఫస్ట్ క్లాస్ లేదా డిస్టింక్షన్ మార్క్స్ వస్తూ ఉంటాయి.మరి ఆయన రెండు సాహసంతమైన సినిమాలు తీశారు.దానివల్ల ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న సినిమాలోని మిగతా విషయాలు వాటన్నిటిని పక్కకు వెళ్లేలా చేశాయి
ఉదాహరణకు.1995 లో బొంబాయి సినిమా( Bombay Movie ) వచ్చింది.ఈ సినిమాలో హిందూ ముస్లిం గొడవలు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.వాస్తవానికి ఈ సినిమా తీయడానికి అప్పుడు విశ్వహిందూ పరిషత్( Vishwa Hindu Parishat ) వారు తమ కర వకులతో బాబ్రీ మసీదును కూల్చివేయాలని ఆర్డర్స్ వేయగా వారు చేసిన విధ్వంసం అలాగే దాని వలన జరిగిన తదుపరి అల్లర్లలో 3000 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.
దాన్ని ఎంతో హృదయానికి హత్తుకునే విధంగా ఈ సినిమాలో పెట్టారు మణిరత్నం.అయితే బాబ్రీ మసీదు( Babri Masjid ) కూల్చి వేస్తున్న నిజమైన సంఘటన వీడియోలను కూడా పెట్టాలని ప్రయత్నించినా సెన్సార్ ఒప్పుకోలేదు.
ముంబైలో ఎక్కువగా అల్లర్లు చేయడంతో దాన్ని సినిమా పేరుగా కూడా వాడుకున్నారు.అయితే ఈ చిత్రం విడుదలయ్యాక ఎన్నో విధ్వంసాలు జరిగాయి.ఆ సినిమా ప్రదర్శనమవుతున్న థియేటర్స్ పై దాడులు జరిగాయి.కానీ ఈ సినిమాను నిలబెట్టింది పక్కాగా విజువల్స్ అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు.
ఇవన్నీ కూడా అల్లర్ల విషయాలను పక్కకు పెట్టిస్తే సినిమా ని సినిమాల చూడాలని నిరూపించాయి.
మరోవైపు 1992లో కాశ్మీర్ టెర్రరిస్టుల కారణంగా భారతదేశంలో జరుగుతున్న అల్లర్లను అలాగే నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనను తీసుకొని రోజా సినిమా ను( Roja Movie ) తెరకెక్కించారు.అయితే దీనిని ఎక్కువగా ఒక భారతీయుడిని కిడ్నాప్ చేయడం వల్ల దేశం మొత్తం కూడా ప్రశంశించ దగ్గ సినిమా గానే వచ్చింది.ఇక ఈ సినిమాలో కూడా సంగీతం ఎంత చక్కగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలా రెండు నిజ జీవిత సంఘటనలు మణిరత్నం ఎంతగానో బాధించాయి.అందువల్ల వాటిని ఆధారంగా చేసుకుని సినిమాలు తీశారు.అయితే ఎక్కడా కూడా సినిమా పక్కదారి పట్టకుండా ఒక అద్భుతంగా తెరకెక్కించడంలో మణిరత్నం సక్సెస్ అయ్యారు.