చాలాసార్లు విక్రమ్( Vikram ) తనదైన స్టైల్ లో పంథాలో సినిమాలు తీస్తూ వెళ్తూ ఉంటారు.ఆయన చేస్తున్న సినిమాకి సంబంధించి పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్.
ఒక సినిమా కోసం ఎంతలా అయినా కష్టపడతారు.ఎంతైనా బాడీని ఇబ్బంది పెడతాడు.
జుట్టు పెంచుతాడు గడ్డం పెంచుకుంటాడు.మరొక సినిమా కోసం వాటిని అప్పటికి అప్పుడు మార్చుకోలేడు.
చాలామంది హీరోలు విగ్గులు వాడి ఒకే టైం లో రెండు షూటింగ్స్ చేస్తారు కానీ విక్రమ్ చాలా నిజాయితీగా సినిమా చేస్తున్న ఒక్క కోసం కష్టపడతాడు.అయితే ఇలా ఉన్న ప్రతిసారి ఏదో ఒక గొప్ప విషయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది.
అలాంటి ఒక గొప్ప విషయమే విక్రమ్ జీవితంలో జరిగింది అదే ‘ రోజా ‘ సినిమా.( Roja Movie )
మణిరత్నం 1992లో తీసిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు.భారతదేశం మొత్తం గర్వించే విధంగా ఈ సినిమా ఉంటుంది.అయితే ఈ సినిమాలో తొలుత అరవింద్ స్వామిని( Aravind Swamy ) హీరోగా అనుకోలేదట.
మధుబాల హీరోయిన్ గా ఫిక్స్ అయినప్పటికి హీరో కోసం వెతుకుతున్న క్రమంలో విక్రమ్ ని చాలామంది సూచించారట.విక్రమ్ కూడా చాలా అందంగా ఎంతో బాగా లుక్స్ వైస్ గా ఉండడంతో అతడినే హీరోగా అనుకున్నారు.
కానీ అప్పటికి వేరే సినిమా కోసం లుక్ ఉండాలని గడ్డం, జుట్టు బాగా పెంచాడట విక్రమ్.
అయితే రోజా సినిమాలో హీరోకి అలా గడ్డం ఉండడానికి లేదు.అందువల్ల సినిమా కోసం తన లుక్కుని మార్చుకోమని దర్శకుడు మణిరత్నం( Director Maniratnam ) విక్రమ్ ని కోరాడట.అందుకు ఒప్పుకొని విక్రమ్ రోజా సినిమా నుంచి తప్పకున్నాడు.
దాంతో విక్రమ్ స్థానంలో అరవింద స్వామిని హీరోగా తీసుకున్నాడు మణిరత్నం.ఆ తర్వాత జరిగిన సినిమా గురించి మనందరికి తెలిసిందే.
అది సాధించిన విజయాలు, చాలా అద్భుతంగా వచ్చిన పాటలు అన్నీ కూడా మనం కల్లారా చూసాం.కేవలం జుట్టు, గడ్డం వల్ల విక్రమ్ ఇలాంటి ఒక సినిమాను మిస్ చేసుకోవడం నిజంగా బాధాకరమే.