వైష్ణవ్ తేజ్ రెండో సినిమాపై క్లారిటీ ఇచ్చిన క్రిష్

పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేయడానికంటే ముందుగా దర్శకుడు క్రిష్ ఒక నవల ఆధారంగా వైష్ణవ్ తేజ్ తో సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గిరిజన రైతుల కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

 Director Krish Gives Clarity On Vaishnav Tej Movie, Uppena Movie, Rakul Preet Si-TeluguStop.com

ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.ఈ భామ సినిమాలో గిరిజన యువతి పాత్రలో కనిపించబోతుందని టాక్.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కేవలం 45 రోజుల్లో దర్శకుడు క్రిష్ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.వైష్ణవ్ తేజ్ రెండో సినిమాగా ఇది తెరకెక్కింది.

ఈ సినిమా అయిపోయిన వెంటనే క్రిష్ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేశాడు.

హరిహర వీరమల్లు షూటింగ్ లో ప్రస్తుతం క్రిష్ బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే ఈ సినిమా 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.మూడు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని క్రిష్ అనుకున్న కరోనా సెకండ్ వేవ్ అడ్డంకిగా మారింది .అలాగే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కూడా సమస్యగా మారింది.ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తో తెరకెక్కించిన సినిమాకి క్రిష్ కేవలం ఒటీటీ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ తో కంప్లీట్ చేశాడని, త్వరలో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది.

అయితే దీనిపై తాజాగా క్రిష్ క్లారిటీ ఇచ్చాడు.వైష్ణవ్ తేజ్ మూవీ థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని, ఒటీటీలో రిలీజ్ చేస్తామనే మాటలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు.

దీనికి సంబందించిన అప్డేట్ త్వరలో వస్తుందని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube