ధనుష్ 'నేనే వస్తున్నా టీజర్' రిలీజ్.. ఆ సినిమాను గుర్తు చేస్తోందిగా!

తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన చిత్రం నానే వరువెన్.ఈ సినిమా తెలుగులో నేనే వస్తున్నా అన్న పేరుతో విడుదల కానుంది.సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Dhanush Selvaraghavan Nene Vastunna Teaser Out , Dhanush , Teaser Release, Geet-TeluguStop.com

ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తోంది.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ను విడుదల చేశారు.

అదేమిటంటే తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో ధనుశ్‌ క్లాస్‌, రస్టిక్ రోల్స్‌తో ద్విపాత్రాభినయం చేసినట్లు గా తెలుస్తోంది.అయితే తాజాగా వదిలిన టీజర్ ను చూస్తుంటే అపరిచితుడు సినిమా గుర్తుకు వస్తోంది.

ఈ సినిమాలో హీరో విలన్ లాగా నటిస్తూ, అమాయకుడి లాగా నటిస్తూ పాత్రలో వేరియేషన్స్ చూపించే సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి.హీరో ధనుశ్‌ దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగవ సినిమా ఇది.

ఈ చిత్రంలో కమెడియన్‌ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్‌, ఎల్లి అవ్రాయ్‌ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.ఇకపోతే హీరో ధనుష్ విషయానికి వస్తే.హీరో ధనుష్, తన భార్య ఇటీవలే విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటివలే అనుకోని కారణాలవల్ల విడిపోతున్నట్టుగా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube