వైరల్: సెకెను వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నారు.. వీరినే అదృష్టవంతులు అంటారు!

మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.ముఖ్యంగా ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఎకడ్నుంచి వస్తాయో ఊహించడం ఒకింత కష్టమే.

 Two Men Narrowly Avoided Being Hit By Out Of Control Truck Video Viral Details,-TeluguStop.com

కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు జనాలు తృటిలో ప్రాణాలతో బయటపడుతుంటారు.ఇప్పుడు అలాంటి ఓ ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నాము.

ఇక్కడ ఆక్సిడెంట్‌ జరిగిన తీరు చూస్తే ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉంది.వీడియోలో కొందరు వ్యక్తులు రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డ తీరు నిజంగా వారి అదృష్టానికి ప్రతీకగా చెప్పుకోవాలి.

అదుపు తప్పిన ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు పాదచారులు తృటిలో తప్పించుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ఈ సంఘటన సెప్టెంబరు 5న చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లో జరిగినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తూ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ప్రమాద దృశ్యాలు వెలుగులోకి వచ్చింది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు వెంబడి వేగంగా వెళుతున్న ట్రక్కు ఒకటి వేగంగా దూసుకొచ్చింది.ఆ వాహనం ఏకంగా ఓ దుకాణంలోకి దూసుకెళ్లే ముందు సమీపంలోని మరో ట్రక్కును, ఒక చెట్టును ఢీకొట్టింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు భయంతో వణికిపోతున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో బాక్స్‌లతో నిండిన ఎర్రటి వాహనం వెనుక ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు.ట్రక్కు గేటును అతడు ఏదో సర్దుబాటు చేస్తున్నాడు.

అంతలోనే మరోవ్యక్తి బయటకు వచ్చి ఏదో అక్కడ పడేసి తిరిగి లోపలి వెళ్తున్నాడు.పక్కనే ఎర్రటి ట్రక్కు గేటు వద్దనున్న వ్యక్తి కూడా అప్పుడే పక్కకు జరిగాడు.

సరిగ్గా అదే సమయంలో ఒకే ఒక్క సెకనులో అక్కడ ఘోరం జరిగింది.రోడ్డుపై వెళ్లాల్సిన ఓ వాహనం అదుపు తప్పిన వేగంగా దూసుకువచ్చింది.

ఎర్రటి ట్రక్కను ఢీకొట్టింది.ఆ తర్వాత అక్కడే ఉన్న మరో చెట్టును ఢీకొట్టింది.

స్పీడ్‌గా వచ్చి వెహికిల్‌.ఢీ కొనడంతో అక్కడ పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube