రోడ్ల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే మందుల సామేలు

సూర్యాపేట జిల్లా:గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

వెలుగుపెల్లి నుండి కాశీతండా,పర్సపల్లి వరకు రూ.6 కోట్లతో చేపట్టే రోడ్డుకు,తుంగతుర్తి మండల కేంద్రం నుండి రావులపల్లి వరకు రోడ్డు విస్తరణ,నిర్మాణం కోసం రూ.20 కోట్ల పనులకు, బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో రూ.12 లక్షల వ్యయంతో నూతన ల్యాబ్ మెటీరియల్స్ గదికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆరు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.రాజకీయాలకతీతంగా నిరుపేదలను గుర్తించి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున అందిస్తామని, దీని కోసం బడ్జెట్లో సుమారు రూ.22,500 కోట్లు ప్రతిపాదన చేయనున్నట్లు తెలిపారు.గత 30 ఏళ్లుగా తుంగతుర్తిలో ఏ ఎమ్మెల్యే గురుకుల పాఠశాలకు రోడ్డు వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రాగా తక్షణమే పది లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు ఏర్పాటు చేశామన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి రానున్న ఎంపీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించే విధంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి జిల్లా అధికారి పద్మావతి,యుగంధర్ రావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ, కిషన్ రావు,జిల్లా నాయకులు గుడిపాటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Development Is Only Possible With The Construction Of Roads , Construction Of Ro

Latest Suryapet News