నాన్ వెజ్ లవర్స్‌కి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.ముఖ్యంగా చికెన్ రోస్ట్( Chicken Roast ) అంటే చెవి కోసుకుంటారు.
ఈ రోస్ట్ ప్రిపేర్ చేయాలంటే ఎర్రటి మంట మీద చికెన్ పీసెస్ వేసి వాటిని కాల్చాలి.వేడిగా ఉన్నప్పుడు తింటేనే రుచి అదిరిపోతుంది.
చాలామంది ఇలాగే రోస్ట్ తయారు చేస్తారు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం చికెన్ రోస్ట్‌ను వెరైటీగా తయారు చేశారు.అది చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.
ఈ చికెన్ రోస్ట్ వీడియోకి రెండు కోట్ల దాకా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే జెయింట్ వీలర్ మెషిన్ లాంటిది మనకు కనిపిస్తుంది.దాని కింద ఒక నిప్పుల కుంపటి బిల్డ్ చేశారు.జెయింట్ వీల్ ( Giant wheel )తిప్పుతుంటే కింద ఉన్న మంటల వేడికి చికెన్ ముక్కలు సమానంగా రోస్ట్ అవడం మనం చూడవచ్చు.
మాములుగా అయితే చికెన్ రోస్ట్ కావాలంటే కనీసం గంట సమయం పడుతుంది కానీ ఇలా వీలర్ పైన చికెన్ ముక్కలు ఉంచి తిప్పడం వల్ల.అవి బాగా కాలడం లేదు.
ఒక్కో ముక్కకి మంట ఎక్కువగా పెడితేనే అది బాగా రోస్ట్ అవుతుంది.ఈ పద్ధతిలో వాటిని పూర్తిగా రోస్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు.
ఇలాంటి మరికొన్ని యంత్రాలు కూడా పక్కనే ఉన్నాయి.వాటి మీద ఉడికించాక అవి చివరికి ఎలా తయారయ్యాయో మాత్రం ఈ వీడియోలో చూపించలేదు.

సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారిన ఈ వీడియోకు చికెన్ ఫెయిర్ అనే క్యాప్షన్ జోడించారు.చికెన్ రోస్ట్ చేసే ప్రాంతాన్ని అమ్యూజ్‌మెంట్ పార్క్ థీమ్‌తో అందంగా డెకరేట్ చేశారు.చూసేందుకు ఇది ఒక ఎగ్జిబిషన్ వలె కనిపించింది.దీనిపై నెటిజన్లు మిక్స్డ్ రియాక్షన్స్ ఇచ్చారు.కొందరికి ఇది నచ్చితే మరి కొందరికి నచ్చలేదు.చక్కగా మంట పెట్టి గిన్నెలో పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా ఇలాంటి తిప్పలు అవసరమా అని మరికొందరు ప్రశ్నించారు.
దీని మీద చికెన్ రోస్ట్ కావాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది ఏమో అని కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







