ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు ప్రతి రోజు అప్డేట్ చేయాలి - అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వివరాలు ప్రతి రోజు అప్డేట్ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్, పరిష్కారం తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు.ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనలో మేరకు పరిష్కరించాలని ఆదేశించారు.

Details Of LRS Applications Should Be Updated Every Day Additional Collector Khe

పంచాయతీ కార్యదర్శులు ఎంపీఓలు, ఆర్ఐలు నీటిపారుదల శాఖ ఏఈలు తమ పరిధిలో ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయనే వివరాలు తీసుకోవాలని సూచించారు.దరఖాస్తు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో ఉన్నాయా? సీలింగ్ భూములు నిషేధిత భూముల ఉన్నాయా అనే అంశాలన్నీ మొబైల్ యాప్ లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పూర్తి చేయాలని పేర్కొన్నారు.ప్రతిరోజు తమ పరిధిలో ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారు తనకు వివరాలు పంపించాలని డిపిఓను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

  జిల్లాలో మొత్తం 42 వేల 491 దరఖాస్తులు రాగా, ఇంకా 36,200 పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.ఆయా దరఖాస్తులను నిర్ణిత గడువు విధించి త్వరగా పరిష్కరించాలని సూచించారు.

Advertisement

ఇక్కడ ఇన్చార్జి డిపిఓ శేషాద్రి డిఎల్పిఓ గీత డిటిసిపిఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!
Advertisement

Latest Rajanna Sircilla News