రైతు వేదికలను మినీ ఫంక్షన్ హాల్స్ గా మార్చండి: సీపీఐ

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న రైతు వేదికలను, మినీ ఫంక్షన్ హాల్స్ గా మార్చి ఉపయోగంలోకి తేవాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పార్టీ కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించిందని,ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీకి అనుబంధంగా చేసి,మినీ ఫంక్షన్ హాల్స్ గా మార్చి, అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు,వంట గదులు నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన పెళ్లిళ్లు, ఫంక్షన్లకు నామ మాత్రపు కిరాయిలు చెల్లించే విధంగా పంచాయతీరాజ్ సెక్రటరీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.

Convert Farmers Venues Into Mini Function Halls CPI, Farmers Venues ,mini Funct

తద్వారా ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం సమకూరుతుందన్నారు.

Advertisement

Latest Suryapet News