కలుషితమవుతున్న కృష్ణమ్మ

సూర్యాపేట జిల్లా:విషపూరితమైన కంపెనీ వ్యర్ధాలను అర్ధరాత్రి తీసుకొచ్చి చింతలపాలెం మండలంలోని బుగ్గమాదారం వద్ద కృష్ణానదిలో వదులుతున్న కెమికల్ ట్యాంకర్ ను శుక్రవారం అర్ధరాత్రి గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రధాన పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను ట్యాంకర్ల ద్వారా తరలించి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండలం బుగ్గ మాధారం గ్రామ సమీపంలోని కృష్ణానదీ వాగులో గుట్టుచప్పుడు కాకుండా వదులుతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చింతలపాలెం ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కృష్ణానదిని విషావూరితంగా మారుస్తున్న వారిపై,వారికి సహకరిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Contaminating Krishnamma-కలుషితమవుతున్న కృష్

Latest Suryapet News