ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.ఇక పార్ట్ 2 గా తెరకెక్కనున్న ‘పుష్ప ది రూల్‘ కోసం ఎదురు చూడని సినీ ప్రేక్షకుడు లేడు.
ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టి ఉత్తరాది ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది.
350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.
అయితే ఇది ఒక్క పార్ట్ తో పూర్తి అవ్వలేదు.దీంతో సుకుమార్ ఈ సినిమాను మరొక పార్ట్ కూడా తీస్తున్నట్టు తెలిపాడు.
పుష్ప ది రూల్ పేరుతొ ఈ సినిమా తెరకెక్కుతుంది.
సుకుమార్ గత ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు.
మరి ఇప్పటికి సుకుమార్ స్టోరీలో కీలక మార్పులు కూడా చేసినట్టు బౌండ్ స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్టు అల్లు అర్జున్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.అయితే ఈ క్రమంలోనే మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పార్ట్ 1 లో పుష్పరాజ్ ప్రేయసిగా కనిపించిన రష్మిక మందన్న.పార్ట్ 2 లో మాత్రం భార్యగా కనిపించనుంది.
అయితే ఈమె పాత్ర సినిమా మొత్తం ఉండదని.మధ్యలోనే చనిపోతుంది అని టాక్ వచ్చింది.ఈ వార్త వచ్చిన తర్వాత ఇప్పుడు మరొక గాలి వార్త పుట్టుకు వచ్చింది.శ్రీవల్లి పాత్ర గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.ఈ సమయంలోనే ఈ సినిమాలో ఫారిన్ బ్యూటీని నటించేందుకు సుకుమార్ ప్లాన్ చేసాడని.ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నటీమణులను ఆడిషన్స్ కు కూడా రెడీ చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు.
మరి సుక్కు నిజంగానే శ్రీవల్లి పాత్రను చంపేసి విదేశీ బ్యూటీని దింపుతున్నాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.చూడాలి మరి ఇది కేవలం రూమర్ గానే ఉంటుందా.
లేదంటే నిజమేనా అనేది.