రేపు మఠంపల్లి భూభారతి సదస్సుకు హాజరుకానున్న కలెక్టర్

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండల కేంద్రంలోని వీఆర్ఎల్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం 9.00 గంటలకు జరిగే భూభారతి చట్టం -2025 సదస్సుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరుకానున్నారని మఠంపల్లి ఎమ్మార్వో మంగ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

భూ భారతి చట్టంపై సమగ్ర అవగాహన కొరకు మండలములోని రైతులు, నాయకులు,ప్రజాప్రతినిధులు, అధికారులు,మండల ప్రజలందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Latest Suryapet News