మోతె మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు...!

సూర్యాపేట జిల్లా:మోతె మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రి,రెవెన్యూ అధికారులతో అభివృద్ధి పనులపై పరిశీలించారు.

తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Collector Conducts Surprise Checks In Mote Mandal , Mote Mandal, Collector Tejas

అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల తప్పుఒప్పుల సవరణపై సమీక్షించారు.సీజన్ రావడంతో విషజ్వరాలు ప్రబలుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంఘమిత్ర,ఎంపిడిఓ హరిసింగ్,డిటి సూరయ్య, సుపెర్నడెంట్ వెంకటాచారి, ఆర్ఐ అజయ్,మల్సూర్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News