పెళ్లి రోజంటేనే ఎవరికైనా ఒక ప్రత్యేకమైన రోజు.జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా చెప్పవచ్చు.
ఈ మధుర గుర్తులు జీవితాంతం గుర్తు ఉంటాయి.అలాంటి రోజును సంతోషంగా అందరి మధ్య జరుపుకోవాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది.
అయితే అలాంటి రోజును ఒక స్వీట్ సర్ప్రైజ్ తో వధువు( Bride ) మరింత ప్రత్యేకంగా మలిచింది.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.
చైనాలోని( China ) అన్హుయ్ ప్రావిన్స్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.బోజౌ అనే ఏరియాలో ఒక ప్రత్యేకమైన వివాహం జరిగింది.
ఈ పెళ్లిలో వధువు ఖరీదైన పెళ్లి దుస్తుల్లో కాకుండా తన స్కూల్ యూనిఫామ్‌తో( School Uniform ) వచ్చింది.
![Telugu School Unim, Surprises Groom, Chinese, Groom, Latest, Sweet-Latest News - Telugu School Unim, Surprises Groom, Chinese, Groom, Latest, Sweet-Latest News -](https://telugustop.com/wp-content/uploads/2023/10/Chinese-Bride-Surprises-Groom-with-School-Uniform-Wedding-Dress-detailsa.jpg)
ఇది చూసి వరుడు ఉద్వేగానికి లోనవ్వగా.పెళ్లికి వచ్చినవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.వధూవరులు ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు.
స్కూల్ లో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వీరి ప్రేమ అలాగే కొనసాగుతూ వస్తోంది.
దీంతో తన ప్రియుడికి సర్ ప్రైజ్( Surprise ) ఇవ్వాలని వధుడు భావించింది.ఈ క్రమంలో స్కూల్ యూనిఫామ్‌ను పెళ్లి దుస్తులగా ధరించి అందరినీ ఆశ్చర్యపర్చింది.
![Telugu School Unim, Surprises Groom, Chinese, Groom, Latest, Sweet-Latest News - Telugu School Unim, Surprises Groom, Chinese, Groom, Latest, Sweet-Latest News -](https://telugustop.com/wp-content/uploads/2023/10/Chinese-Bride-Surprises-Groom-with-School-Uniform-Wedding-Dress-detailss.jpg)
వధువు లోపలికి రాగానే వరుడు చూసి భావోద్వేగానికి లోనయ్యాడు.వెంటనే ఆమెను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఆమెను చూడగానే వరుడికి చిన్ననాటి స్కూల్ విషయాలు గుర్తుకొచ్చాయి.దీనికి కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇది కాస్త వైరల్ గా మారింది.వివాహ దుస్తుల కంటే స్కూల్ యూనిఫాం అనే కాన్సెప్ట్ ఎంతో అందమైనది అని కొంతమంది కామెంట్ చేస్తోన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి.అలాగే పెద్దఎత్తున లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
చిన్ననాటి విషయాలను ఎప్పటికీ మర్చిపోలేమని, అవి స్వీట్ మెమెరీస్( Sweet Memories ) అని కామెంట్ చేస్తోన్నారు.