ఆగని చర్లగూడెం భూ నిర్వాసితుల ధర్నాలు

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడెం మండలం చర్లగూడెం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు గత ఏడాది కాలంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కోసం నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.

కానీ,వారిని ఏ మాత్రం పట్టించుకోని ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు నేడు ఉప ఎన్నిక పుణ్యమా అని ఆగమేఘాల మీద పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఇందులో భాగంగా భూములు కోల్పోయిన నర్సిరెడ్డి గూడెంకు చెందిన రైతులు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అందలేదని,తాజాగా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో కొందరి పేర్లు లేవని శుక్రవారం నిరసనకు దిగారు.దీనితో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Charlagudem Land Dwellers' Sit-ins-ఆగని చర్లగూడెం

దీనితో బాధిత రైతులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

భాధితులు అందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా పనులు ఎలా మొదలు పెడతారని,పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదని,2013 పార్లమెంట్ ఆర్ అండ్ ఆర అంత క్లియర్ అయిన తరువాతనే పనులు ప్రారంభించాలని అన్నారు.అలా అక్కడి నుండి ప్రజలను తరలించకుండా జీవో నెంబర్ 123 తీసుకొచ్చి ఇలా ఆగమేఘాల మీద కొంతమందికే ప్యాకేజీ ఇచ్చి మోసం చేయడం సరికాదని అన్నారు.

Advertisement

తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని,ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో పేర్లు లేని వారిని కూడా పరిగణనలోకి తీసుకొని ఆర్ అండ్ ఆర్ అమలు చేయాలని సూచించారు.లేకపోతే ఉద్యమం ఆపమని హెచ్చరించారు.

పోలీసులు ఏమీ తెలుసుకోకుండా బాధితులను అరెస్ట్ చేయడం కాదని,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టొద్దని 2013 లో పార్లమెంట్ చట్టం చేసిందని,చట్టంలో ఏముందో తెలుసుకోవాలని సూచించారు.రాజీనామాతో రాజీకొస్తున్న పనులు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నిసార్లు అసెంబ్లీలో,బయటా అడిగినా ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని,రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా తరువాత సంవత్సరం నుండి ధర్నా చేస్తున్న నిర్వాసిత రైతులకు హుటాహుటినా నష్టపరిహారాన్ని అందజేశారని తెలిపారు.

అయితే ఇంకా చాలా మంది పేర్లు ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి జాబితాలో లేవని రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారని,వారికి కూడా న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత
Advertisement

Latest Nalgonda News