చంద్రబాబు రేవంత్ రెడ్డి ( Chandrababu-Revanth reddy ) ఒకప్పుడు టిడిపి పార్టీలో మంచి ఆత్మీయ అభినవభావం ఉన్నటువంటి నాయకులు.ముఖ్యంగా చంద్రబాబు నుంచే రేవంత్ రెడ్డి రాజకీయాలు చేయడం నేర్చుకున్నారని చెప్పవచ్చు.
చంద్రబాబు నమ్మిన బంటుగా టిడిపి వెంట నడిచారు రేవంత్ రెడ్డి.ఆయన టిడిపి ( TDP ) పార్టీకి రాజీనామా చేసిన సమయంలో కూడా చంద్రబాబుకు ప్రత్యేకంగా లేఖ రాసి అనేక విషయాలను తెలియజేశారు.
చంద్రబాబు నాయకత్వంలో అనేక పోరాటాలు చేశానని, ఆయన వల్ల నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయని, ఆయనతో నేను అన్ని నేర్చుకున్నాను అని మా ఇద్దరి బంధం జీవిత కాలం మర్చిపోలేనిదని కొనియాడారు.ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశానని అందులో నేను భాగస్వామ్యం కావడం నా అదృష్టం అని చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఆయనకు రాజకీయ విద్య నేర్పిన వ్యక్తిలా చంద్రబాబును పొగిడిన రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ప్రస్తుతం చంద్రబాబు గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.ఆ వివరాలు ఏంటో చూద్దాం.టిడిపి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ టిపిపి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో కాస్త జోష్ పెరిగింది.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ ( BRS ) ను ఎలాగైనా ఓడించగలదనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది.
అలా కాంగ్రెస్ ను ముందుకు నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి.ఆయన ఎంత ముందుకు వెళ్లినా కానీ అందులో ఉన్నటువంటి సీనియర్ నేతలు రేవంత్ పై ఎప్పుడూ ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉన్నారు.
ఆయన టిడిపి మనిషి అని, చంద్రబాబు చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు.కట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ( Chandrababu) అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
దీంతో ఆయనకు కిషన్ రెడ్డి, బండి సంజయ్( Bandi Sanjay ) , టిడిపిలో ఉండేటువంటి ఇతర శ్రేణులు సంఘీభావం తెలియజేశారు.ఆయన అరెస్టు దారుణమని ఖండించారు.అంతేకాకుండా టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సీతక్క ( MLA Sithakka ) కూడా చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యబద్ధంగా లేదంటూ మాట్లాడింది.ఇంతమంది మాట్లాడుతున్న తన గురువుగారు అయినటువంటి చంద్రబాబు గురించి రేవంత్ రెడ్డి మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు.
ఆయన కష్టాల్లో ఉంటే కనీసం అండగా కూడా నిలవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే రేవంత్ స్పందించక పోవడానికి ప్రధాన కారణం ఆయన పార్టీలోని సీనియర్ నాయకులు అని చెప్పవచ్చు.
ఇప్పటికే టిడిపి అభిమాని రేవంత్ రెడ్డి ( Revanth reddy ) అంటూ ఆయన పై అబండాలు వేస్తున్నారు.ఈ తరుణంలో చంద్రబాబుకు సపోర్టుగా ఉంటే మాత్రం ఇంకెన్ని మాటలు అంటారో అని ఆయన సైలెంట్ గా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.