త్వరలోనే బెంగళూరు నుంచి హైద‌రాబాద్‌కు బుల్లెట్ ట్రైన్‌..

హైదరాబాద్.దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్ ప్లేస్‌లో ఉంది.

 Bullet Train From Bangalore To Hyderabad Soon Bullet Train, Viral News, Hyderab-TeluguStop.com

ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు నివాసయోగ్యమైన నగరంగా రూపాంతరం చెందింది.ప్రస్తుతం భాగ్యనగరం కాస్మోపాలిటన్ సిటీ‌గా వడివడిగా అడుగులేస్తోంది.

నిజాం కాలం నుంచే హైదరాబాద్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ప్రస్తుతం అన్ని రకాల భాషలు మాట్లాడేవారు ఇక్కడ ఉంటున్నారు.

భాగ్యనగరానికి అన్ని ప్రాంతాల నుంచి కనెక్టివిటి ఉంది.రోడ్డు, వాయు, రైలు మార్గాల ద్వారా ఎక్కడి నుంచి అయిన ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

తాజాగా హైదరాబాద్‌కు మరో తీపి కబురు చెప్పింది కేంద్రం.హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది.

బెంగళూరు టూ హైదరాబాద్ మార్గంలో ఈ బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది.దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గనుంది.

అలాగే ఆర్థిక వ్యవస్థకు బుల్లెట్ ట్రైన్స్ మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా 8 కారిడార్లలో బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు  జరుగుతున్నట్లు సమాచారం.ఈ ప్రాజెక్టు సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Telugu Bangalore, Bullet Train, Central, Hyderabad, Telengana-Latest News - Telu

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 4 కారిడార్లలో కూడా బుల్లెట్ ట్రైన్స్‌లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది.ఇందులో భాగంగానే బెంగళూరు-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ రాబోతుంది.ఇందుకు రైల్వే శాఖ కూడా పచ్చ జెండా ఊపింది.దీంతో భాగ్యనగరం శిగలో మరో మణిహారం వచ్చి చేరుతుందన్న మాట.ఇప్పటికే మెట్రోతో భాగ్యనగరం కళకళలాడుతోంది.అలాగే పాట్నా-గౌహతి, అమృత్ సర్- పఠాన్ కోట్, నాగపూర్- వారణాసి మార్గాల్లో బుల్లెట్ ట్రైన్స్ త్వరలోనే పరుగులు తీయనున్నాయి.

దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి సమయం ఆదా అయినట్లే మరీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube