స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా జలకాలాడిన బర్రెలు.. యజమానికి రూ.25 లక్షలు బొక్క!

గతేడాది జులైలో యూకేలోని కోల్‌చెస్టర్‌కి( colchester in UK ) సమీపంలో ఉన్న వీవెన్‌హోలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

ఒక జంట సేద తీరడానికి తమ కోసం ఒక లగ్జరీ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకుంది.

అయితే సమీపంలోని ఒక డెయిరీ ఫామ్‌ నుంచి గేదెల( Buffalos in Dairy farm ) ఈ స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి.మొత్తం పద్దెనిమిది గేదెలు పొలం నుంచి తప్పించుకుని దంపతుల స్విమ్మింగ్ పూల్‌ వద్దకు వచ్చాయి.

ఆ తర్వాత అందులో జలకాలాడుతూ ఎంజాయ్ చేశాయి.ఈ సంఘటన వల్ల దంపతులకు £25,000 (సుమారు రూ.25 లక్షలు) నష్టం వాటిల్లింది.అయితే వారు లీగల్‌గా పోరాటం చేయడంతో చివరికి ఆ మొత్తం వీరికి లభించింది.

Buffalos Who Had Fun Swimming In The Swimming Pool Rs. 25 Lakh Reward For The Ow

ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో( CCTV Cemaras ) రికార్డైంది.దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గానూ మారింది.గేదెలు పూల్ లోపల ఈత కొట్టడం ఫుటేజీలో కనిపించింది.

Advertisement
Buffalos Who Had Fun Swimming In The Swimming Pool Rs. 25 Lakh Reward For The Ow

వీడియోను నిషితంగా పరిశీలిస్తే కొన్ని గేదెలు పొరపాటున స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయినట్లు కనిపించింది.దీన్ని చూసి ఇతర గేదెలు ఆందోళనకు గురయ్యాయి.

దీనివల్ల కేవలం 15 నిమిషాల్లో గందరగోళం ఏర్పడింది.దీంతో మరో మరికొన్ని గేదెలు పూల్‌లో పడటంతో నీరు మసకబారింది.

అదృష్టవశాత్తూ, గేదెలను వాటి యజమాని అయిన రైతు క్షేమంగా రక్షించారు.అయితే దంపతుల ఆస్తినష్టం మాత్రం గణనీయంగానే ఉంది.

గేదెల తొక్కిసలాట వల్ల పూల్ ఫెన్సింగ్, పూల పడకలు ధ్వంసమయ్యాయి.ఆండీ, లినెట్ స్మిత్( Andy, Lynette smith ) దంపతులు ఈ సంఘటనను స్థానిక మీడియాకు తెలియజేశారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

ఉదయాన్నే టీ చేస్తూ కిచెన్ కిటికీలోంచి బయటకు చూడగానే పూల్‌లో గేదెలను చూశానని లినెట్ చెప్పింది.పరిస్థితిని నివేదించడానికి ఆమె వెంటనే అత్యవసర సేవలకు (999) కాల్ చేసింది.

Advertisement

కానీ త్వరగా సహాయం అందలేదు.అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

ఆండీ స్మిత్ గేదెలు అత్యంత భారీ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయని, పూల్ చుట్టూ ఉన్న పింగాణీ టైల్స్ జారే విధంగా ఉన్నాయని వివరించాడు.అందువల్ల గేదెలు తమ పట్టును నిలుపుకోలేక స్విమ్మింగ్ పూల్‌లో పడ్డాయని, తర్వాత బయటకు రాలేకపోయాయని తెలిపారు.తర్వాత ఈ జంట ఎన్‌ఎఫ్‌యు మ్యూచువల్ అనే బీమా కంపెనీకి బీమా క్లెయిమ్‌ను దాఖలు చేయాల్సి వచ్చింది.

కాగా వారికి పరిహారం అందడంలో ఆలస్యం జరిగింది.ఇన్‌స్పెక్టర్ పర్యటన ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది.

చివరికి, కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లించింది.

తాజా వార్తలు