కారు దిగి హస్తం గూటికి చేరిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు పెంజర్ల సత్తయ్య యాదవ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి కి చెందిన సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు పెంజర్ల సత్తయ్య యాదవ్ బి ఆర్ ఎస్ పార్టీ నీ వీడి గురువారం కాంగ్రెస్ పార్టీ లో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

మొదటి నుండి బి ఆర్ ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ,మంత్రి కెటిఆర్ వద్ద గుర్తింపు పొందిన సత్తయ్య యాదవ్ కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా సత్తయ్య యాదవ్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ లో చురుకైన కార్యకర్తగా పనిచేసిన కానీ బి ఆర్ ఎస్ లో ప్రాధాన్యత లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని సత్తయ్య యాదవ్ పేర్కొన్నారు.

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలి - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Latest Rajanna Sircilla News