దళిత బంధులో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇష్టారాజ్యం

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దళిత బంధు పథకాన్ని బీఆర్ఎస్( BRS ) పార్టీకి చెందిన అనర్హులను ఎంపిక చేసి,అర్హులైన దళితులకు న్యాయం చేశారని ఆరోపిస్తూ గ్రామంలో ప్రధాన రహదారిపై శుక్రవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కి వ్యతిరేకంగా, కేసీఅర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ పార్టీ పథకాల్లా మారుస్తూ,అర్హులకు అందకుండా గులాబీ రంగు పూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోనుగోడు దళిత బంధు ఎంపికపై సర్పంచ్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

BRS Is The Will Of The Public Representatives In Dalit Bandhu , Dalit Bandhu, BR
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News