చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ కు గతంలో జరిగిన అవమానాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గత కొన్నేళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ గురించి కావాలనే స్పందించడం లేదు.
అయితే ఎన్టీఆర్ స్పందించకపోవడం గురించి బాలయ్య ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్లు చేశారు.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్( NTR Fans ) సైతం బాలయ్య కామెంట్లకు ధీటుగా బదులిస్తున్నారు.బాలయ్యను సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.తారక్ ఎంత చేసినా మీ కంటికి కనిపించదంటూ ఎన్టీఆర్ అభిమానులు ఒకింత ఘాటుగా స్పందిస్తున్నారు.
బాలయ్య ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారో ఆ ప్రెస్ మీట్లలో బాలయ్య ఏం మాట్లాడుతున్నారో కనీసం ఆయనకు అయినా అర్థమవుతుందా అని ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.
బాలయ్య ప్రెస్ మీట్లు( Balakrishna Pressmeet ) టీడీపీకి మైనస్ అవుతున్నాయని వాళ్లు చెబుతున్నారు.
ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ కు మేము అండగా ఉంటామని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.మరి కొందరు ఫ్యాన్స్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామాను సమర్పిస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ను ఇంతలా ద్వేషించే పార్టీలో నేను ఉండలేనని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రాణాలు ఇస్తామని తారక్ గురించి అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మేము అంగీకరించబోమని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఓపెన్ డిబేట్ పెట్టుకుంటే ఎవరు ఎవరికి ఏం చేశారో అర్థమవుతుందని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్( TDP Junior NTR Craze ) ను అవసరానికి అనుగుణంగా వాడుకోవాలని ప్రయత్నించిందని నెటిజన్లు చెబుతున్నారు.
బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ వేర్వేరుగా సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.







