టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా లోకేశ్ ములాఖత్ కానున్నారు.ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును లోకేశ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కలవనున్నారు.
ఇందుకు గానూ చంద్రబాబు కుటుంబ సభ్యులు అమరావతి నుంచి రాజమండ్రికి ఇప్పటికే బయలు దేరారు.ములఖాత్ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదేవిధంగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తులో భాగంగా సమన్వయం కోసం ఐదుగురు టీడీపీ సభ్యులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు.మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.







