జానా చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ చేసింది శూన్యం:జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం( Nagarjuna Sagar constituency )లో జరిగిన ప్రతి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగినదని,అభివృద్ధి చేసింది కాంగ్రెస్,అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెసేనని నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్( Kunduru Jaiveer ) అన్నారు.

పెద్దవూర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) వల్ల నియోజకవర్గంలోని అభివృద్ధి 10 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు.

ఇక్కడ అభివృద్ధి అంతా శిలాఫలకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు పబ్బు యాదగిరి గౌడ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సతీష్,మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠం షురూ..!
Advertisement

Latest Nalgonda News