అంజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలి: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా:శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం వేములవాడ అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి( Sri Jodanjaneya Swami ) వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ అంజన్న ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాల్లో వెలుగులు ఉండాలని ఆ అంజన్నను వేడుకున్నారు.

వారి వెంట అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కత్తి కనకయ్య, ప్రభాకర్ రెడ్డి, ఎర్రం ఆగయ్య, నరేందర్, బోనాల రమేష్ శరత్ బాబు షేర్ల మల్లేశం తదితరులు ఉన్నారు.

Blessings Of Anjana To All: Rajanna Sirisilla District Congress Party President
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

Latest Rajanna Sircilla News