రైతన్న కోసం బిజెపి రణభేరి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) రైతులు పట్ల నిర్లక్ష్యం వహించడాన్నీ నిరసిస్తూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్( Bandi Sanjay ) పిలుపు మేరకు అన్ని అసెంబ్లి కేంద్రాల్లో జరుగుతున్న రైతు దీక్ష వేములవాడ పట్టణంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ కార్యాలయంలో దీక్ష నిర్వహించడం జరిగింది ఈ దీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ,ఇరవైవేల రూపాయల రైతు భరోసా , పదిహేను వెలరూపాయల కౌలురతుల చేయూత,ధాన్యం ఎదైనా ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలి, అదేవిధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మూడు గంటలు దీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్,కిసాన్ బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, కిసాన్ మోర్చ జిల్ల అధ్యక్షులు కోల కృష్ణ స్వామి,ఎస్ సి మోర్చ జిల్లా అధ్యక్షులు సంటీ మహేష్,ఓ బి సి జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్,చందుర్తి మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, కొనరావు పేట మండల అధ్యక్షులు గొట్టే రామచంద్రం, జిల్ల ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్,వేములవాడ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.

BJP Ranbheri For Raithanna , Congress Govt, BJP , Bandi Sanjay ,Rythu Bharosa ,

Latest Rajanna Sircilla News