బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్ర బాధ్యుల తో ప్రత్యేక సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్ర బాధ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు నుండి వచ్చిన బూత్ కమిటీ, శక్తి కేంద్ర పర్యవేక్షులు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బూత్ కమిటీలు శక్తి కేంద్రాలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రతి బూతుల లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

BJP Booth Committee Members Meeting In Rajanna Sircilla,Rajanna Sircilla,BJP,BRS

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అవినీతి పాలనను ప్రజలకు వివరించాలని,గడీల పాలనను బద్దలు కొట్టి కాషాయ జెండా తెలంగాణలో ఎగరవేయాలని దానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కంకణ బద్ధులై ముందుకు కదలాలని నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గుండాడి వెంకటరెడ్డి,కోనేటి సాయిలు, బంధారపు లక్ష్మారెడ్డి, నేవూరి దేవేందర్ రెడ్డి,చందుపట్ల లక్ష్మారెడ్డి,మినహాజ్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి,బోడవాత్ రవి, బొమ్మాడి స్వామి,కిరణ్ నాయక్, ప్రకాష్, ఆంజనేయులు, కృష్ణ హరి,భాస్కర్,బాపురెడ్డి,శరత్ రెడ్డి,సవిన్ కుమార్,అరవింద్, బాబు, శ్రీశైలం,లక్ష్మణ్,ప్రశాంత్, రవి,బాలా గౌడ్,బాలయ్య, రాకేష్,సత్యం రెడ్డి,గణేష్, జోహార్ రమేష్,మల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి తదితరులు నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు,జిల్లా నాయకులు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!
Advertisement

Latest Rajanna Sircilla News