ఎస్సీలు పూజలో పాల్గొన్నారని బీజేపీ దాడి

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా బుధవారం జరిగిన దాడిని బీజేపీ నేతలు వక్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ కు చెందిన తడకమళ్ళ రవి కుమార్,చెరుకు పరమేష్ ఆరోపించారు.

గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ బుధవారం రాత్రి దసరా పండుగ దగ్గర సంకినేని రవీందర్ రావు సంకినేని వరుణ్ రావుల ప్రోత్సాహంతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారని,దళితులు గుడిలోకి వచ్చి ఎలా పూజలో పాల్గొంటారంటూ కుల వివక్షతో నానా దుర్భాషలాడుతూ దళితులపై రాళ్లు,కట్టెలతో దాడి చేశారని అన్నారు.

ఈ దాడిలో గాయపడిన వారు తడకమళ్ళ రవి కుమార్,చెరుకు పరమేష్,మల్లెపాక చంటి,పులి గోపి,బత్తుల సతీష్,బొంకురి హరిప్రసాద్ లు తుంగతుర్తి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.దాడికి కారకులైన బీజేపీ నాయకులు సంకినేని రవీందర్ రావు,సంకినేని వరుణ్ రావు,మల్లెపాక సాయిబాబు,బండి నవీన్, నారాయణదాస్ నాగరాజు,ఉప్పుల కుమార్ లతో పాటు మరో 50 మంది ఉన్నారని,వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

BJP Attack That SCs Participated In Puja-ఎస్సీలు పూజలో �

Latest Suryapet News