గాడ్ ఫాదర్ విజయం పై స్పందించిన సల్మాన్.. మై డియర్ చిరు లవ్ యు అంటూ?

చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

 Salman Reacted To The Success Of Godfather My Dear Chiru I Love You , Salman , S-TeluguStop.com

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా విజయంలో సల్మాన్ పాత్ర కూడా ఎంతో ఉంది.

ఇకపోతే సల్మాన్ ఖాన్ తాజాగా ఈ సినిమా విజయం పై స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా సల్మాన్ గాడ్ ఫాదర్ సినిమా గురించి మాట్లాడుతూ.మై డియర్ చిరు గారు ఐ లవ్ యు.గాడ్ ఫాదర్ సినిమా బాగా ఆడుతుందని విన్నాను కంగ్రాట్యులేషన్స్.గాడ్ బ్లెస్ యు వందేమాతరం అంటూ ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ, సల్మాన్ ఖాన్ దానికి ‘#గాడ్ ఫాదర్’ అని క్యాప్షన్ పెట్టి చిరంజీవి, రామ్ చరణ్‌లను ట్యాగ్ చేశాడు.

ఈ విధంగా సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై స్పందిస్తూ పోస్ట్ చేయడంతో వెంటనే రామ్ చరణ్ స్పందిస్తూ తిరిగి రిప్లై ఇచ్చారు.

సల్మాన్ ఖాన్ చేసిన పోస్టుకు రాంచరణ్ స్పందిస్తూ ముడుచుకున్న చేతులు హార్ట్‌ ఎమోజీలతో స్పందించారు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు సత్యదేవ్ నయనతార వంటి స్టార్ సెలబ్రిటీలకు కూడా నటించారు.ఇక ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube