బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నాగార్జున హోస్టింగ్, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవల వల్ల గత కొన్ని వారాల నుంచి ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షోపై ఆసక్తిని పెరిగింది.గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో గ్రాండ్ ఫినాలేకు కొన్ని వారాల ముందు నుంచే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
నాగబాబు, అక్కినేని అమల, విజయ్ దేవరకొండ లాంటి సెలబ్రిటీలు సైతం అభిజిత్ కే మద్దతు ప్రకటించడంతో అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని సాధారణ ప్రేక్షకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజుల క్రితం వరకు పోల్ అవుతున్న ఓట్లలో సగం ఓట్లు అభిజిత్ కే వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే ఊహించని విధంగా నిన్నటి నుంచి అభిజిత్ కంటే అరియానాకు ఎక్కువగా ఓట్లు వస్తున్నాయని తెలుస్తోంది.

అయితే శుక్రవారం రాత్రి వరకు ఓట్లు వేసే అవకాశం కూడా ఉండటంతో అభిజిత్ మళ్లీ మొదటి ప్లేస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.బిగ్ బాస్ ఈ సీజన్ కు లేడీ కంటెస్టెంట్ ను విన్నర్ చేయాలని భావిస్తే మాత్రం అభిజిత్ కు ఝలక్ తప్పదని తెలుస్తోంది.అయితే అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం క్షణానికి ఒకసారి మారిపోయే పోల్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిజిత్ తప్పక విన్నర్ అవుతాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ ప్రేక్షకులు మాత్రం సోహెల్ విన్నర్ అయితే బాగుంటుందని సీజన్ 4 లో జెన్యూన్ గా ఆడుతున్న కంటెస్టెంట్ సోహెల్ మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారో తెలియాలంటే మాత్రం మరో మూడు రోజులు ఆగాల్సిందే.
బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని ప్రేక్షకులకు ఊహించని సర్ ఫ్రైజులు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఉంటాయని తెలుస్తోంది.