వారణాసిలో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలు

వారణాసిని భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగానే కాకుండా భూమిపై అత్యంత దిగ్భ్రాంతి కలిగించే మరియు సందర్శించదగ్గ ప్రదేశం అని చెప్పవచ్చు.ప్రతి రెండు సెకన్లకు మనకు కొత్త మరియు ఉత్తేజకరమైన ఏదో ఒక విషయం కనబడుతుంది.

 Best Places To Visit In Varanasi Dashashwamedh Ghat-TeluguStop.com

వారణాసిలో పవిత్రమైన అనుభూతి కలుగుతుంది.వారణాసిలో గంగా నది చరిత్ర, అర్థాలు, చిహ్నాలు, సంస్కృతి మరియు మతం అన్ని ఒక మేజిక్ లా ఉంటాయి.ఇప్పుడు వారణాసిలో ఖచ్చితంగా చూడవల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1.గంగా హారతి
గంగా హారతిని సాయంత్రం నిర్వహిస్తారు.ఈ నది యొక్క ప్రాముఖ్యత బిలియన్ మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది.ఈ ప్రదేశంలో శాస్త్రం మరియు మతం, మానవ భావోద్వేగాలు మరియు నమ్మకాలు అన్ని ఉన్నాయి.ఈ అద్భుతమైన నదిని చూసినప్పుడు, నదికి సొంత ఆత్మ ఉంటుందని తెలుసుకుంటాం.

ఆ ప్రదేశంలో వేలాది మంది ప్రార్థనలు చేయటం, వంగి నమస్కరించటం, దీపాలను వెలిగించి గంగా నదిలో వదలటం వంటివి మంత్రముగ్దులను చేస్తాయి.ఈ విధంగా చేయటం వలన చేసిన పాపాలు పోతాయని నమ్మకం.

2.పడవ మీద ప్రయాణిస్తూ సూర్యాస్తమయం లేదా సూర్యోదయం చూడటం వారణాసిలో గంగా నదిలో పడవలో ప్రయానించటం ఒక అద్భుతమైన అనుభవం.ముఖ్యంగా ఉదయం ప్రారంభ కాంతి స్పూర్తిని ఇస్తుంది.ఆ సమయంలో యాత్రీకుల స్నానాల సందడి మరియు పూజలు ఉంటాయి.అయితే ఈ నది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన పరిసరాలను కలిగి ఉంది.అయినా ఇప్పటికి ఈ నదిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

పడవ ప్రయాణం ద్వారా ఒక ఘాట్ నుండి మరొక ఘాట్ కి వెళ్ళవచ్చు.అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతాయి.

3.సారనాథ్ పురావస్తు మ్యూజియం
వారణాసికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో భారతదేశ పురాతన సైట్ మ్యూజియం ఉంది.ఈ మ్యూజియంలో ఐదుకు పైగా గ్యాలరీలు మరియు శిల్పాలు ఉన్నాయి.ఇవి 3 వ శతాబ్దం BC నుండి 12 వ శతాబ్దం CE కి చెందిన కళాఖండాలు అని చెప్పవచ్చు.ప్రధాన హాల్ కుడి వైపున శాక్య సిన్హా గేలరీ ఉంది.ఇక్కడ భారతదేశం యొక్క జాతీయ చిహ్నం అయిన మౌర్య పిల్లర్ యొక్క ఇసుక రాయితో ఉన్న లయన్ కాపిటల్ ముక్కలను చూడవచ్చు.ఈ ప్రదేశంలో బుద్దుడు నిర్వాణం పొందిన చెట్టు కూడా ఉంది.

4.మాలవ్య బ్రిడ్జ్ వీక్షణ
వారణాసి, మొఘల్సరాయ్ రెండు నగరాలను కలుపుతూ ఉన్న మాలవ్య బ్రిడ్జ్ ని కాశీ లేదా వారణాసి ఘాట్స్ నుండి వీక్షించవచ్చు.ఈ రెండు అంతస్తుల వంతెన 1000 మీటర్ల పొడవు ఉంటుంది.

ఇక్కడ నుంచి అన్ని వైపులకు స్పష్టమైన మార్గం ఉంది.అయితే ఇక్కడ నుంచి పవిత్ర నగరం యొక్క భిన్నమైన కోణంను చూడవచ్చు.ఈ వంతెన నిఘాలో ఉండుట వలన ఎక్కువసేపు ఈ ప్రదేశంలో ఉండకుండా కేవలం ఫోటోలు తీసుకోని బయటకు వచ్చేస్తే మంచిది.

5.గోడలపై ఆకర్షణీయమైన గ్రాఫిటీ
కాశీ లేదా వారణాసి గోడలపై ఉండే గ్రాఫిటీలు అనేక కథలను చెప్పుతాయి.వారణాసి ఘాట్స్ గోడలపై ప్రత్యేకమైన మరియు ప్రేరేపించే అనేక గ్రాఫిటీలు ఉంటాయి.

వీటిని దగ్గర నుంచి చూస్తే చాలా ఆకర్షణీయంగాను మరియు అసక్తికరంగాను ఉంటాయి.ఇవి మత పరమైన లేదా పురాణములకు సంబందించినవిగా ఉంటాయి.వీటిలో శివ,గణపతి వివిధ అవతారాలు ఉన్నాయి.

6.సాధువులు
ఈ నగరంలో ఎక్కువగా సాధువులను చూడవచ్చు.ఇక్కడ వారు ప్రాపంచికానికి దూరంగా ఒంటరిగా ఉంటారు.

ఒకరితో ఒకరికి సాహచర్యం కూడా ఉండదు.ఈ శివుని యొక్క నగరం గురించి అనేక అతీంద్రియ దృగ్విషయాలు మరియు కథలు ఉన్నాయి.

ఇక్కడ అందరూ స్నేహంగానే ఉంటారు.కానీ గెడ్డం ఉన్న ప్రతి వ్యక్తి సాధువని అనుకోకూడదు.

అయితే సాధువుల ద్వారా ప్రేరణ పొంది వారి పాదాలకు మొక్కవలసిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube