ఈరోజు ఆకుపచ్చ దుస్తులు ధరించి పూజ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

బుధవారం ఆదిదేవుడైన వినాయకుడికి పూజలు చేయడం విశేషం.మనం ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగాలని ప్రథమ పూజ వినాయకుడికి చేస్తాము.

 Benefits Of Pooja Doing Wearing Green Colour Dresses Pooja, Green Colour Dresse-TeluguStop.com

అలాంటి వినాయకుడి ఆలయాన్ని బుధవారం దర్శించుకోవడం వల్ల సకల సంతోషాలను కలిగి ఉంటారు.బుధవారం ఆకు పచ్చని దుస్తులు ధరించి పూజ చేయడంవల్ల ఎన్నో ఫలితాలున్నాయి.

మరి ఆ ఫలితాలు ఏమిటి? అన్న విషయాలను ఇక్కడ తెలుసుకుందాం

బుధవారం వినాయకుడికి ప్రత్యేకమైన రోజు.ఆ రోజు వినాయకుడు ఆలయానికి వెళ్లి, గరిక సమర్పించి వినాయకుడిని ఆరాధించడం ద్వారా సకల దోషాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

బుధవారం వినాయకుడికి పూజ చేసేవారు, ఆకుపచ్చ దుస్తులు ధరించడం వల్ల అనుకున్న పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతాయి.అలాగే స్త్రీలు బుధవారం రోజున ఆకు పచ్చ గాజులు ధరించి, ఆకుపచ్చని పూలు అంటే సంపంగి పూలు మొదలైనవి పెట్టుకోవడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కలుగుతుంది.

అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పుతో చేసిన లడ్డూలు, హల్వా, పాయసం లేదా పెసరట్టు నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే చింత, సీమచింత పండ్లు స్వీకరించడం ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

బుధగ్రహానికి బుధవారం అనుకూలమైన రోజు.

బుధగ్రహానికి బుధవారం పూజలు చేయడం ద్వారా విద్యాబుద్ధులు, విదేశీయానం, వాయిదా పడిన పనులు జరుగుతాయి.బుధుడికి ఎంతో ఇష్టమైన రంగు ఆకుపచ్చ.

పెసరపప్పు ఎంతో ఇష్టమైన ధాన్యం.పెసరపప్పుతో అభిషేకం చేసి పెసరతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించడం ద్వారా బుధుని అనుగ్రహం కలిగి మనం అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి.

అలాగే బుధునికి ఆకుపచ్చని వస్త్రములను సమర్పించవలెను.అలాగే బుధవారం రోజున ఆకుపచ్చని వస్త్ర దానం చేయడం ద్వారా ఆ కుటుంబానికి ఉన్న దోషాలు తొలగి, సుఖ సంతోషాలు కలుగుతాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube