మహేష్ బాబు కామెంట్స్ .. 14 ఏళ్ళ క్రితమే అలా కామెంట్స్ చేసిన షారుఖ్ ఖాన్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై చేసిన వాఖ్యలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే.

 Bollywood Badshah Shah Rukh Khan Comments On Hollywood This Old Video Goes Viral Amid Mahesh Babus Controversial Statement, Bollywood, Shahrukh Khan, Hollywood, Mahesh Babu-TeluguStop.com

అడివి శేష్ ప్రధానపాత్రలో నటించిన మేజర్ సినిమాకు హీరో మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల ఈ సందర్భంగా మహేష్ బాబు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తెగ వైరల్ అయ్యాయి.

బాలీవుడ్ నుంచి నాకెన్నో ఆఫర్స్ వచ్చాయి.కానీ, ఆ ఇండస్ట్రీ నన్ను భరించలేదు.అందుకే అక్కడికీ వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు.టాలీవుడ్ లో నాకు అమితంగా ప్రేమాభిమానాలు లభిస్తున్నాయి.

 Bollywood Badshah Shah Rukh Khan Comments On Hollywood This Old Video Goes Viral Amid Mahesh Babus Controversial Statement, Bollywood, Shahrukh Khan, Hollywood, Mahesh Babu-మహేష్ బాబు కామెంట్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ళ క్రితమే అలా కామెంట్స్ చేసిన షారుఖ్ ఖాన్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందువల్ల ఈ ఇండస్ట్రీని వదిలి వేరే పరిశ్రమకు వెళ్లాలని నేను ఎప్పుడు అనుకోలేదు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గతంలో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పై ఇలాంటి కామెంట్స్ చేశాడు.

హాలీవుడ్ సినిమాలో ఎందుకు నటించడం లేదు అన్న ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు షారుక్ ఖాన్.

నా ఇంగ్లీషు అంతగా బాగుండదు.మాటలు రాని వ్యక్తి పాత్ర ఇస్తే నటించే అవకాశం ఉంది.అలాగే నేను అంత అందంగా ఉండడం ఉన్న టిడిపి ఉండాల్సిన లక్షణాలు కూడా లేవు.

అంతే కాకుండా నాకు కుంగ్ ఫూ కూడా రాదు.అలాగే లాటిన్ సాల్సా డాన్స్ ఎలా చేస్తారో కూడా తెలియదు.

నేను కావాల్సినంత పొడుగు కూడా లేను.నాలో టాలెంట్ అంతగా లేదు అటువంటివారికి హాలీవుడ్ లో చోటు లేదు అంటూ ఆసక్తికరంగా స్పందించారు షారుఖ్ ఖాన్.

అందువల్లే నేను భారత్ సినిమాలలో మాత్రమే నటిస్తాను.భారతీయ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లాలని ఆశిస్తున్నాను అని తెలిపాడు.

అయితే ఈ వ్యాఖ్యలు అన్నీ కూడా షారుక్ ఖాన్ 14 ఏళ్ల క్రితమే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో చేశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube