ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటీమణులలో సమంత ఒకరు.ప్రస్తుతం వరుస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
కేవలం తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా సమంత బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులను కూడా సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
సమంత ప్రస్తుతం నటించిన శాకుంతలం, యశోద సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ విధంగా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సమంత తన జిమ్ ట్రైనర్స్ గురించి చెప్పుకొచ్చారు.సమంత సినిమాల తర్వాత ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే వాటిలో ఫిట్ నెస్ ఒకటి.
ఈమెకు ఏమాత్రం విరామం దొరికిన వెంటనే జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
![Telugu Junaid Shaik, Mann Kurrani, Samantha, Samanthagym, Shaakuntalam, Telugu, Telugu Junaid Shaik, Mann Kurrani, Samantha, Samanthagym, Shaakuntalam, Telugu,](https://telugustop.com/wp-content/uploads/2022/05/samantha-interesting-post-on-her-gym-trainers-viral-on-social-media-detailss.jpg )
ఈ విధంగా తన ఫిట్ నెస్ మెయింటెన్ చేయడం కోసం సమంత ప్రత్యేకంగా ట్రైనర్స్ ను నియమించుకున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా సమంత తన జిమ్ ట్రైనర్స్ గురించి చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా ఆమె వారి గురించి చెబుతూ.
మన్ కరానీ , జునైద్ షేక్ లతో నా మార్నింగ్స్ , ఎక్కడికి వెళ్లినా వీళ్లిద్దరు నుండి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను అంటూ సమంత తన జిమ్ ట్రైనర్స్ గురించి తెలియజేశారు.ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.