అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఘోర అవమానం జరిగింది.ఒక పక్క ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ట్రంప్ ని తరుముకొస్తున్న సమస్యలు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంటే .
మరో పక్క ప్రత్యర్ధి పార్టీల రాజకీయ దాడులు మరో పక్క ప్రకృతి సైతం ట్రంప్ పై పగ బట్టడంతో ఏమి చేయాలో కూడా పాలు పోని పరిస్థితి నెలకొంది.అమెరికాలో అడవులలో రాజుకున్న కార్చిచ్చు ఇప్పటికే 10 మంది అమెరికన్స్ ని బలి తీసుకోగా సుమారు 45 లక్షల హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతైపోయింది.
సరిగ్గా రెండు నెలల క్రితం అమెరికా అడవులలో అగ్ని రాజుకుని అతిపెద్ద విపత్తు సంభవిస్తే తాజాగా ఇలాంటి సంఘటనే కాలిఫోర్నియా అడవుల్లో జరగడంతో ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాలిఫోర్నియా అడవుల్లో రాజుకున్న ఈ కార్చిచ్చు మెల్లగా వాషింగ్టన్ , ఒరెగాన్, ఇదాహో రాష్ట్రాలకి కూడా వ్యాప్తి చెందుతోంది.
ఎగసి ఎగసి పడుతున్న ఈ మంటలని ఆర్పడానికి లెక్కకి మించిన ఫైర్ ఇంజన్ లు, హెలికాఫ్టర్ ద్వారా నీటిని అడవుల్లో జల్లుతున్నా ఫలితం మాత్రం కనపడటంలేదు.సుమారు 30 వేల మంది ప్రజలు మంటలు ఆర్పడానికి శ్రమిస్తూనే ఉన్నారు.
కానీ ఫలితం మాత్రం కనపడక పోవడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
మంటలను అదుపుచేయలేని అసమర్ధ ప్రభుత్వం, అసమర్ధ అధ్యక్షుడు అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఈ పరిస్థితులని క్యాష్ చేసుకోవడానికి డెమోక్రాట్లు కూడా రంగంలోకి దిగారు.పర్యావరణాన్ని కాపాడటంలో అందరికంటే నేనే ఫస్ట్ అని చెప్పే ట్రంప్ కేవలం మాటలు చెప్పడానికే తప్ప చేతల్లో మాత్రం సున్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ట్రంప్ స్థానికంగా పరిస్థితులు పరిశీలించాడానికి వచ్చిన క్రమంలో ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ట్రంప్ అసమర్ధుడు అంటూ వ్యాఖ్యానించడంతో ట్రంప్ ఒకింత అసహనానికి గురయ్యారని స్థానిక మీడియా పేర్కొంది.
అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అగ్ని ప్రమాద ఘటన ట్రంప్ కి అతి పెద్ద మైనస్ అనే చెప్పాలి.