బ్రాహ్మణులను కించ పరిచిందంటూ టాలీవుడ్ యాంకర్ పై కేసు నమోదు....

టాలీవుడ్ లో బుల్లితెర రాములమ్మ గా పేరు తెచ్చుకున్నటువంటి అందమైన యాంకర్, నటి శ్రీముఖి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే పలురకాల షోలు, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Sreemukhi, Tollywood Beautiful Anchor, Actress, Julakataka, Programme, Gemini Tv-TeluguStop.com

అంతేకాక టాలీవుడ్ ప్రముఖ టెలివిజన్ సంస్థలు అయినటువంటి జెమిని, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు, తదితర చానళ్లలో తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే తాజాగా ఈ అమ్మడుపై  పోలీసు కేసు నమోదైనట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం “జూలకటక” అనే షోకి ఈ అమ్మడు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.అయితే ఈ షో ప్రముఖ టెలివిజన్ సంస్థ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యేది.

అయితే ఈ మధ్య కాలంలో జూలకటక షోని ఛానల్ నిర్వాహకులు పునః ప్రసారం చేస్తున్నారు.దాంతో తాజాగా ప్రసారం అయినటువంటి ఓ ఎపిసొడ్ లో శ్రీముఖి చేసినటువంటి వ్యాఖ్యలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని కొందరు బ్రాహ్మణులు హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్రీముఖి పై ఫిర్యాదు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ సినీ పరిశ్రమలో బాగానే దుమారం రేపుతోంది.అంతేగాక పలువురు నెటిజన్లు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.

అలాగే మరికొందరు నెటిజన్లు మాత్రం షో లో నటించే నటీనటులు కేవలం దర్శక నిర్మాతలు చెప్పిన విధంగానే చేస్తుంటారని కాబట్టి నటీనటుల పై కేసు నమోదు చేయడం సరికాదని అంటున్నారు. అయితే మరోపక్క తన పై కేసు నమోదు అయ్యిందంటూ వస్తున్నటువంటి వార్తలపై యాంకర్ శ్రీముఖి మాత్రం స్పందించడం లేదు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు టాలీవుడ్ ప్రముఖ టెలివిజన్ సంస్థ అయినటువంటి ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేగాక పలు సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube