కొత్తది తెస్తానంటోన్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తూ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాడు.

 Ntr To Bring New Talent To Industry-TeluguStop.com

ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందు.

ఇక ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే లాంఛ్ అయిన ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో మొదలుపెట్టేందుకు తారక్ అండ్ టీమ్ ప్లా్న్ చేస్తున్నారు.ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో కొంత మేర నిర్మాణ పనులను ఎన్టీఆర్ స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.త్వరలో తాను ప్రారంభించే ప్రొడక్షన్ కంపెనీ కోసం ఈ సినిమాను ఉపయోగించుకోనున్నాడట తారక్.

త్వరలో సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెట్టి కొత్త ట్యాలెంట్‌కు ప్రోత్సాహం అందించాలని తారక్ చూస్తున్నాడు.తన ప్రొడక్షన్ కంపెనీతో కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహించడం నిజంగా గర్వించే విషయం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరి తారక్ తన ప్రొడక్షన్ కంపెనీని ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube