సాధారణంగా సినిమాలలో నటించే నటీనటులకు ఎలాంటి కష్టాలు ఉండవని అందరూ భావిస్తారు.అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కినా ఇతర నటీనటులకు మాత్రం పరిమితంగానే పారితోషికం దక్కుతుంది.
సినిమాలలో నటించే కొంతమంది నటీనటులు రోజుకు 5,000 రూపాయల కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు.అలా బాలీవుడ్ స్టార్స్ పక్కన నటించి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో సోలంకి దివాకర్( Solanki Diwakar ) ఒకరు.
సోంచిరియా, ది వైట్ టైగర్( The White Tiger ), డ్రీమ్ గర్ల్ సినిమాలలో సోలంకి దివాకర్ నటించారు.సోలంకి దివాకర్ ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, ప్రియాంక చోప్రాలతో కలిసి నటించారు.అయితే ఈ నటుడు ప్రస్తుతం పండ్ల వ్యాపారంలో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.సినిమాల్లోకి రాకముందు వృత్తిరిత్యా పండ్ల వ్యాపారి అయిన సోలంకి దివాకర్ ఢిల్లీలో ఒకప్పుడు చేపట్టిన పండ్లు అమ్మే వృత్తిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
నటనపై ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి వచ్చానని లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.కుటుంబ పోషణ కోసం తాను పండ్ల వ్యాపారంలోకి వచ్చానని సోలంకి దివాకర్ కామెంట్లు చేశారు.
నటన అంటే నాకు మొదటినుంచి ప్రేమని మొదట నేను థియేటర్ లో పాపడ్ అమ్మేవాడినని అన్నారు.ఆ సమయంలో నటనపై మక్కువ పెంచుకున్నానని సోలంకి దివాకర్ ( Solanki Diwakar )చెప్పుకొచ్చారు.
ఈరోజు నేను సినిమాలలో నటించినా సరిపడా డబ్బులు సంపాదించలేకపోయానని నా కుటుంబాన్ని పోషించాలనే ఆలోచనతో పండ్లు అమ్ముతున్నానని పేర్కొన్నారు.సినిమాలలో నాకు తగినంత జీతం వస్తే పండ్లు అమ్మనని ఛాన్స్ దొరికితే 1000 సినిమాల్లో నటించాలని భావిస్తున్నానని వెల్లడించారు.నాకు తరచుగా పాత్రలు రావడం లేదని వేరే మార్గం లేక నేను పండ్లు అమ్మాల్సి వస్తోందని సోలంకి దివాకర్ పేర్కొన్నారు.సోలంకి దివాకర్ కామెంట్ల గురించి బాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.