తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ అప్పడప్పడూ తెలుగులో తళుక్కున మెరిసే ముద్దు గుమ్మల్లో నటి వేదిక ఒకరు.ఈమె ఒక తెలుగులోనే కాక తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి పలు భాషల్లో నటించింది.
తాజాగా ఈ అమ్మడు తెలుగులో నందమూరి బాలకృష్ణతో కలిసి “రూలర్” అనే చిత్రంలో నటించింది.కాగాఈ చిత్రం ఈ నెల 20వ తారీఖున విడుదల కానుంది.
ఐతే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేదిక టాలీవుడ్ లెజెండ్ బాలయ్య బాబుపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తెలుగు సినీ పరిశ్రమలోనే నందమూరి బాలకృష్ణ గారు ఒక లెజెండ్ అని, అయన ఒక్క సినిమాలోనే కాక నిజ జీవితంలో కూడా అసలైన లెజెండ్ అంటూ సంచలనం వ్యాఖ్యలు చేసారు.ఇక నటన విషయానికొస్తే ఆయన కొత్త వాళ్ళతో నటించేటప్పుడు వారికీ తగిన సలహాలు సూచనలు ఇస్తారని అన్నారు.అంతేగాక షూటింగ్ సమయంలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే తారతమ్యం లేకుండా అందరినీ ఒకేవిధంగా చూస్తారని అలాంటి మనస్తత్వం చాలా కొందరికే ఉంటుందని అన్నారు.
ఒకవేళ ఎవరైనా సహాయం కావాలంటూ తన వద్దకు వస్తే తనకు తోచినంత సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి అంటూ వేదిక బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు.
ఆ తరువాత రూలర్ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ తాను ఈ చిత్రంలో మూడు రకాల ఎమోషన్స్ లో నటించానని, ఇందులో సీరియస్ గర్ల్ గా, గ్లామరస్ గర్ల్ గా, కొంత మేర నెగిటివ్ రోల్ ఉండే పాత్రలో నటించానని చెప్పుకొచ్చారు.
అలాగే ఈ చిత్రం చాల బాగుంటుందని, ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని కాబట్టి ప్రతీ ఒక్కరూ సినిమాను థియేటర్ కి వెళ్లి చూడాలని కోరారు.